Crime News | రూ. 200 వివాదం.. విద్యార్థి బట్టలూడదీసి కొట్టిన స్నేహితులు
Crime News | ఓ విద్యార్థి తన స్నేహితుడికి రూ. 200 ఇచ్చాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు అతనిపై దాడి చేశారు. బలవంతంగా మద్యం తాగించి, బట్టలూడదీసి కొట్టారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో వెలుగు చూసింది.
Crime News | లక్నో : ఓ విద్యార్థి తన స్నేహితుడికి రూ. 200 ఇచ్చాడు. ఆ డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగినందుకు అతనిపై దాడి చేశారు. బలవంతంగా మద్యం తాగించి, బట్టలూడదీసి కొట్టారు. ఈ అమానవీయ ఘటన ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఝాన్సీ పట్టణానికి చెందిన ఓ విద్యార్థి పదో తరగతి చదువుతున్నాడు. తన స్నేహితుడికి రూ. 200 ఇచ్చాడు. అయితే ఆ డబ్బులు తిరిగి ఇవ్వాలని కోరాడు. దీంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం పట్టణంలోని ఓ పార్కులో సదరు విద్యార్థి తన స్నేహితులతో కలిసి కూర్చున్నాడు.
డబ్బులు తీసుకున్న ఫ్రెండ్ తన నలుగురు సహచరులతో కారులో పార్కు వద్దకు చేరాడు. అనంతరం అతన్ని బలవంతంగా కారులో ఎక్కించుకుని మౌరానిపూర్ రోడ్డులోని నిర్మానుష్య ప్రదేశానికి తరలించారు. అక్కడున్న ఇద్దరు, కారులో ఉన్న నలుగురు కలిసి.. ఆ విద్యార్థికి బలవంతంగా మద్యం తాగించారు. డబ్బులు అడుగుతావా..? అంటూ అతనిపై విరుచుకుపడ్డారు. బట్టలూడదీసి తమ వద్ద ఉన్న బెల్ట్లు, కర్రలతో చితకబాదారు. ఆ తతంగాన్ని అంతా తమ ఫోన్లలో చిత్రీకరించారు. గంట పాటు వేధించిన తర్వాత.. ఆ దుండగుల నుంచి బాధిత బాలుడు తప్పించుకున్నాడు.
ఈ వీడియోలు రెండు రోజుల క్రితం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, బాధిత బాలుడు తన పేరెంట్స్ సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనలో కొంత మంది విద్యార్థులను అరెస్టు చేసినట్లు సమాచారం. విచారణ అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TTD | సెక్యూరిటీ ,విజిలెన్స్ గార్డు నియామక నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదు : టీటీడీ
YS Jagan | సమగ్రమైన కుల గణనకు వైసీపీ మద్దతు : వైఎస్ జగన్
Health tips | మీ రోజువారీ డైట్లో వెల్లిపాయలుంటే కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసా..?
Inter Exams schedule | రాష్ట్రంలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల..!
Diabetes | వయసుతోపాటు బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ వస్తాయా? పోషకాహార నిపుణుల కీలక హెచ్చరిక..
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

