Womens Day: చెస్ స్టార్ టు స్పేస్ సైంటిస్ట్.. మోదీ ఎక్స్ అకౌంట్లో వుమెన్ అచీవర్స్
Womens Day: మోదీ ఎక్స్ అకౌంట్లో.. వుమెన్ అచీవర్స్ పోస్టు చేస్తున్నారు. చెస్, సైన్స్.. వివిధ రంగాల్లో శిఖర స్థాయికి చేరిన మహిళలు పోస్టు చేస్తున్నారు. మహిళలు తమ కలలను సాకారం చేసుకోవాలని తమ పోస్టులతో ప్రేరణ నింపుతున్నారు.
న్యూఢిల్లీ: అంతర్జాతీయ మహిళా దినోత్సవం(Womens Day) సందర్భంగా ప్రధాని మోదీ సోషల్ మీడియా ఎక్స్ అకౌంట్‌ను మహిళలు ఆపరేట్ చేస్తున్నారు. వుమెన్ అచీవర్స్ ఆ అకౌంట్లో పోస్టు చేస్తున్నారు. ఇండియన్ చెస్ గ్రాండ్‌మాస్టర్ ఆర్ వైశాలి, సైంటిస్టులు ఎలీనా మిశ్రా, షిల్పీ సోనీలు .. ప్రధాని మోదీ అకౌంట్ నుంచి ట్వీట్స్ చేశారు. ప్రధాని ఎక్స్ అకౌంట్లో పోస్టు చేయడం థ్రిల్‌గా ఉందని ఆ వుమెన్ అచీవర్స్ పేర్కొన్నారు. వనక్కం.. నేను వైశాలి.. ప్రధాని మోదీ సోషల్ మీడియా అకౌంట్‌ను ఆపరేట్ చేస్తున్నట్లు చెస్ క్రీడాకారిణి తెలిపారు. దేశం తరపున ఎన్నో టోర్నీలు ఆడానని, దాని పట్ల గర్వంగా ఉందన్నారు. ఆరేళ్ల ప్రాయం నుంచి చెస్ ఆడుతున్నట్లు చెప్పింది. లెర్నింగ్, థ్రిల్లింగ్, రివార్డింగ్ జర్నీలా ఉందని పేర్కొన్నది. యువ అమ్మాయిలకు ఆమె సందేశం ఇచ్చారు. ఎన్ని అవరోధాలు వచ్చినా.. కలలను వీడవద్దు అన్నారు.
Vanakkam!
I am @chessvaishali and I am thrilled to be taking over our PM Thiru @narendramodi Ji’s social media properties and that too on #WomensDay. As many of you would know, I play chess and I feel very proud to be representing our beloved country in many tournaments. pic.twitter.com/LlYTmqE2MQ
— Narendra Modi (@narendramodi) March 8, 2025
స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ టెక్నాలజీలనూ మహిళలు రాణిస్తున్నారు. భారతీయ యువ శాస్త్రవేత్తలు ఎలీనా మిశ్రా, షిల్పీ సోనీలు మోదీ అకౌంట్ నుంచి పోస్టు చేశారు. న్యూక్లియర్ సైంటిస్టు ఎలీనా, స్పేస్ సైంటిస్టు సోనీ కూడా వుమెన్స్ డే సందర్భంగా పోస్టు చేశారు. శాస్త్ర, సాంకేతిక రంగాలకు ఇండియా కేంద్రంగా నిలుస్తుందన్నారు. సైన్స్ రంగంలోకి మరింత మంది మహిళలు రావాలని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
Space technology, nuclear technology and women empowerment…
We are Elina Mishra, a nuclear scientist and Shilpi Soni, a space scientist and we are thrilled to be helming the PM’s social media properties on #WomensDay.
Our message- India is the most vibrant place for science… pic.twitter.com/G2Qi0j0LKS
— Narendra Modi (@narendramodi) March 8, 2025
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

