Tamilnadu | బీఎస్పీ చీఫ్ హత్య.. చెన్నై సీపీని బదిలీ చేసిన తమిళనాడు ప్రభుత్వం
Tamilnadu | తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ కే ఆర్మ్‌స్ట్రాంగ్(52) మూడు రోజుల క్రితం చెన్నై నగరంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసును తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది.
Tamilnadu | చెన్నై : తమిళనాడు బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ కే ఆర్మ్‌స్ట్రాంగ్(52) మూడు రోజుల క్రితం చెన్నై నగరంలో దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసును తమిళనాడు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. చెన్నై సీపీ సందీప్ రాయ్ రాథోడ్‌ను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాథోడ్‌ను పోలీసు ట్రైనింగ్ కాలేజీ డీజీపీగా నియమించారు. అడిషనల్ డీజీపీగా కొనసాగుతున్న ఏ అరుణ్‌ను చెన్నై నగర పోలీసు కమిషనర్‌గా నియమిస్తూ తమిళనాడు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బీఎస్పీ తమిళనాడు అధ్యక్షుడు ఆర్మ్‌స్ట్రాంగ్ శుక్రవారం రాత్రి పెరంబూరులోని తన ఇంటికి సమీపంలో హత్యకు గురయ్యారు. గుర్తుతెలియని వ్యక్తులు బైకులపై వచ్చి ఆయనను హత్య చేశారు. బీఎస్పీ జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఆర్మ్‌స్ట్రాంగ్ పార్థివదేహానికి నివాళులు అర్పించారు. ఆదివారం ఉదయం బీఎస్పీ జాతీయ సమన్వయకర్త ఆకాశ్ ఆనంద్‌తో కలిసి తమిళనాడు రాజధాని చెన్నైకి చేరుకున్న మాయావతి.. అక్కడి నేరుగా ఆర్మ్‌స్ట్రాంగ్ నివాసానికి వెళ్లారు.
ఈ సందర్భంగా మాయావతి మాట్లాడుతూ.. ఆర్మ్ స్ట్రాంగ్ హత్య కేసు విచారణను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోలేదన్నారు. అందువల్లే ఇప్పటి వరకూ ఈ కేసులో నిందితులను అరెస్ట్ చేయలేదని చెప్పారు. బాధితుడికి న్యాయం జరగాలంటే ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని మాయావతి డిమాండ్ చేశారు. ఈ ఘటనతో తమిళనాడులో శాంతిభద్రతలు అదుపులో లేవని తేలిపోయిందన్నారు. ఆర్మ్ స్ట్రాంగ్ హత్య వల్ల దళిత నేతలు భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Varanasi | వారణాసి నుంచి అదిరిపోయే అప్డేట్.. షూటింగ్ పూర్తి, త్వరలోనే రాజమౌళి భారీ సర్ప్రైజ్!
Motivational Story | పొలంలో ముల్లు గుచ్చుకుంటే ఆగలేదు.. అడవిలో పాములను చూసి ఎందుకు భయపడ్డాడు?.
Ant Story | ఓ చిన్న చీమ చెప్పిన గొప్ప జీవిత పాఠం.. ఖురాన్లో ప్రస్తావించిన అద్భుత కథ
Karthika Masam | కార్తిక మాసాన్ని హరిహర మాసం అని ఎందుకంటారు? దీపారాధన నుంచి తులసీ పూజ వరకు ప్రతి ఆచారం వెనుక ఉన్న రహస్యం ఇదే!
Bigg Boss 10 | హైపర్ ఆది పంచులతో హౌస్‌లో నవ్వుల సందడి.. శ్వేత ఎలిమినేట్,అమన్ ఎమోషనల్!
ట్రెండింగ్ వార్తలు
Odisha teacher 14 days in ditch | కొండచరియలు విరుగడంతో గుంతలో చిక్కుకున్న టీచర్.. 14 రోజుల తర్వాత గుర్తించిన కాపరి
Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ

