Spy camera at woman’s house | మహిళ ఇంట్లో రహస్య కెమెరా.. డెంటల్ స్టూడెంట్ అరెస్ట్
Spy camera at woman's house | ఇంట్లో రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరాను ఒక మహిళ గుర్తించింది. దీని ద్వారా తనను వీడియో తీసినట్లు ఆమె అనుమానించింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డెంటల్ స్టూడెంట్ను అరెస్ట్ చేశారు.
చెన్నై: ఇంట్లో రహస్యంగా ఏర్పాటు చేసిన కెమెరాను ఒక మహిళ గుర్తించింది. (spy camera at woman’s house) దీని ద్వారా తనను వీడియో తీసినట్లు ఆమె అనుమానించింది. ఈ విషయాన్ని భర్తకు చెప్పింది. ఆ దంపతులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో డెంటల్ స్టూడెంట్ను అరెస్ట్ చేశారు. తమిళనాడు రాజధాని చెన్నైలో ఈ సంఘటన జరిగింది. ఒక మహిళ తన భర్తతో కలిసి మూడేళ్లుగా ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నది. జనవరి 30న ఆమె ఇంటిని శుభ్రం చేస్తుండగా ఒక పెన్ను మాదిరి పరికరం నుంచి రెడ్ లైట్ రావడాన్ని గమనించింది. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది.
కాగా, పని తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన మహిళ భర్త ఆ పెన్ను మాదిరి పరికరాన్ని పరిశీలించాడు. దానికి రహస్య కెమెరా ఉన్నట్లు గుర్తించాడు. అందులో రికార్డైన క్లిప్‌లు పరిశీలించిన ఆ దంపతులు షాక్ అయ్యారు. ఆ మహిళ దుస్తులు మార్చుకున్నప్పుడు ఆ రహస్య కెమెరా ద్వారా రికార్డ్ చేసినట్లు తెలుసుకున్నారు. ఆ దంపతులు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు.
మరోవైపు ఆ బిల్డింగ్ యజమాని కుమారుడైన ఇబ్రహీం, ఆ రహస్య కెమెరాను ఆ మహిళ ఇంట్లో ఉంచినట్లు పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు. డెంటల్ స్టూడెంట్ అయిన అతడ్ని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rib Remodelling | నడుమును సన్నగా మార్చే రిబ్ రీమోడలింగ్ శస్త్ర చికిత్స.. అసలిదేమిటి.. ఏం చేస్తారు..?
Pragya Jaiswal | వెకేషన్ మూడ్‌లో ప్రగ్యా జైస్వాల్.. అదిరిపోయిన అవుట్డోర్ ఫొటోషూట్!
Anirudh-Kavya | అనిరుధ్ -కావ్య మారన్ పెళ్లి సందడి షురూ.. గ్రీస్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్, చెన్నై రిసెప్షన్
Uranium Stockpile: యురేనియంను తరలించనున్న ఇరాన్
RC 17 | రామ్ చరణ్ – సుకుమార్ సినిమాలో హీరోయిన్గా తెలుగు అమ్మాయి.. రేసులోకి ఆ అమ్మడి పేరు!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

