Chaitanyananda case | చైతన్యానంద సరస్వతి కేసు.. ముగ్గురు మహిళలకు బెయిల్
Chaitanyananda case | తనను తాను ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే చైతన్యానంద సరస్వతి (Chaitanyananda Saraswati) లైంగిక వేధింపుల కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు మహిళలకు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు (Patiala House Court) బెయిల్ మంజూరు చేసింది.
Chaitanyananda case : తనను తాను ఆధ్యాత్మిక గురువుగా చెప్పుకునే చైతన్యానంద సరస్వతి (Chaitanyananda Saraswati) లైంగిక వేధింపుల కేసులో నిందితులుగా ఉన్న ముగ్గురు మహిళలకు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టు (Patiala House Court) బెయిల్ మంజూరు చేసింది. నిందితులు శ్వేత, భావన, కాజల్‌లకు కోర్టు బెయిల్ ఇచ్చింది. రూ.20 వేల చొప్పున వ్యక్తిగత పూచీకత్తుపై వారు బెయిల్ పొందారు.
ఢిల్లీలోని వసంత్ కుంజ్లోగల ప్రముఖ విద్యాసంస్థ అయిన శ్రీ శారదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మేనేజ్మెంట్ శ్రీచైతన్యానంద సరస్వతి ఆధ్వర్యంలో నడిచేది. ఈ క్రమంలో చైతన్యానంద తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని విద్యార్థినిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాలేజీలో మొత్తం 50 మంది విద్యార్థినిలను చైతన్యానంద గురించి విడివిడిగా విచారించగా.. వారిలో 17 మంది అతను తమపై కూడా లైంగిక వేధింపులకు పాల్పడినట్లు చెప్పారు.
చైతన్యానందకు ఆయన దగ్గర పనిచేసే ముగ్గురు మహిళలు కూడా సహకరించారని ఆరోపించారు. స్వామీజీకి సహకరించాలని వారు ఒత్తిడి చేసేవారని పేర్కొన్నారు. దాంతో పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగ్రాకు పారిపోయిన చైతన్యానందను అరెస్ట్ చేసి తీసుకొచ్చి తీహార్ జైల్లో పెట్టారు. ఆయనతోపాటు అరెస్టయిన ముగ్గురు మహిళలకు కోర్టు ఇవాళ బెయిల్ మంజూరు చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

