Watch: బస్సును తప్పించబోయిన సిమెంట్ లారీ.. తర్వాత ఏం జరిగిందంటే?
Cement-Laden Truck Overturns | ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టకుండా తప్పించబోయేందుకు సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. సిమెంట్ బస్తాలు రోడ్డుపై పడ్డాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
లక్నో: ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ఢీకొట్టకుండా తప్పించబోయేందుకు సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆ లారీ అదుపుతప్పి బోల్తాపడింది. (Cement-Laden Truck Overturns) దీంతో అందులోని సిమెంట్ బస్తాలు రోడ్డుపై పడ్డాయి. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఈ సంఘటన జరిగింది. గురువారం నవ్దియా ఝాదా కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు కూడలి వద్ద రోడ్డు దాటింది.
కాగా, అదే సమయంలో బస్సుకు ఎడమ వైపు నుంచి సిమెంట్ లోడ్ ఉన్న లారీ వచ్చింది. దీంతో బస్సును ఢీకొట్టకుండా నివారించేందుకు లారీ డ్రైవర్ ప్రయత్నించాడు. అయినప్పటికీ బస్సును ఆ లారీ స్వల్పంగా ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి రోడ్డుపై బోల్తాపడింది. దీంతో ఆ లారీలోని సిమెంట్ బస్తాలు రోడ్డుపై పడ్డాయి. ఈ ప్రమాదంలో ఎవరైనా గాయపడ్డారా, ప్రాణాలు కోల్పోయారా అన్నది తెలియలేదు. మరోవైపు ఆ ప్రాంతంలోని సీసీటీవీలో రికార్డైన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
बरेली
➡सीमेंट भरा ट्रक पलटने पलटने का वीडियो वायरल
➡बस को बचाने के चक्कर में पलटा सीमेंट भरा ट्रक
➡बिथरी चैनपुर के नवदिया झादा चौराहे की घटना #Bareilly pic.twitter.com/Ur6We8SQBa
— भारत समाचार | Bharat Samachar (@bstvlive) December 29, 2023
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allahabad High Court | యూపీలో సిగ్గుచేటుగా పౌరస్వేచ్ఛ.. రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
Sonia Gandhi | ఎమెర్జెన్సీ విధించడం పొరపాటు నిర్ణయం.. ఆత్మకథలో పేర్కొన్న సోనియా
Agniveer Scheme | మరో రెండేండ్ల సర్వీసు తర్వాత అగ్నివీరులకు పొడిగింపు
Supreme Court | ఓబీసీల పాత నియామకాలు, పదోన్నతులు కొనసాగించొచ్చు : సుప్రీంకోర్టు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

