CBSE | సీబీఎస్ఈ 10, 12వ తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ వచ్చేసింది..!
CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి సంబంధించిన బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు పరీక్షలు జరుగనున్నాయి.
CBSE | సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 10వ తరగతి, 12వ తరగతి సంబంధించిన బోర్డ్ ఎగ్జామ్ షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. 10వ తరగతి బోర్డు ఎగ్జామ్స్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 15 నుంచి మార్చి 13 వరకు జరుగనుండగా.. 12వ తరగతి ఎగ్జామ్స్‌ను ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతాయని సీబీఎస్ఈ వెల్లడించింది. పరీక్షలు ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు కొనసాగుతాయని పేర్కొంది.
CBSE releases date sheet for class 10th Board Exams. Examinations to begin from 15th February 2024. pic.twitter.com/b1syspJ6Ut
— ANI (@ANI) December 12, 2023
10వ తరగతికి సంబంధించిన పరీక్షలు 19న హిందీతో పాటు సంస్కృతం, బెంగాలీ, తమిళం, తెలుగు, గుజరాతీ, మరాఠీ, ఉర్దూ కోర్సు-ఏ, ఉర్దూ కోర్సు-బీ, మణిపురి, ఫ్రెంచ్ పరీక్ష జరుగనున్నది. 21న హిందీ కోర్సు-ఏ, హిందీ కోర్సు-బీ, 26న ఇంగ్లిష్ కమ్యూనికేటివ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, మార్చి 2న సైన్స్, 7న సోషల్ సైన్స్, 11న మ్యాథమెటిక్స్ స్టాండర్డ్, మ్యాథమెటిక్స్ బేసిక్, 13న కంప్యూటర్ అప్లికేషన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరీక్ష జరుగుతాయని బోర్డు తెలిపింది.
12వ తరగతి ఎగ్జామ్ షెడ్యూల్..
ఫిబ్రవరి 19న హిందీ ఎలక్టివ్, హిందీ కోర్ పరీక్ష జరుగనున్నది. 22న ఇంగ్లిష్, ఎలక్టివ్, ఇంగ్లిష్ ఎలక్టివ్ సీబీఎస్ఈ (ఫంక్షనల్ ఇంగ్లిష్), ఇంగ్లిష్ కోర్ పరీక్ష జరుగుతాయని తెలిపింది. 26న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, 27న కెమిస్ట్రీ, 29న జియోగ్రఫీ, మార్చి 4న ఫిజిక్స్, మార్చి 9న మ్యాథమెటిక్స్, 12న ఫిజికల్ ఎడ్యుకేషన్, 14న పంజాబీ, బెంగాలీ, తమిళం, తెలుగు, సింధీ, మరాఠీ, గుజరాతీ తదితర ప్రాంతీయ భాష పరీక్షలు జరుగుతాయని తెలిపింది.
CBSE releases date sheet for class 12th Board Exams. Examinations to begin from 15th February 2024. pic.twitter.com/zRePYph6ly
— ANI (@ANI) December 12, 2023
మార్చి 15న సైకాలజీ, 18న ఎకనామిక్స్, 19న జీవశాస్త్రం, 22న పొలిటికల్ సైన్స్, 23న అకౌంటెన్సీ, 26న ఉర్దూ ఎలక్టివ్, సంస్కృతం ఎలక్టివ్, ఉర్దూ కోర్, 27న బిజినెస్ స్టడీస్, 28న హిస్టరీ, 30న సంస్కృతం కోర్, ఏప్రిల్ 2న కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్ఫర్మేషన్ ప్రాక్టీసెస్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వివరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దక్షిణాది వారికే ఛాన్స్ ఇవ్వాలి
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

