Corruption Case: అవినీతి కేసులో డీఐజీని అరెస్టు చేసిన సీబీఐ
Corruption Case: పంజాబ్‌లోని రోపర్ రేంజ్‌కు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న హర్చరణ్ సింగ్ బుల్లార్‌ను ఇవాళ సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మొహాలీ ఆఫీసులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అవినీతి కేసులో హర్చరణ్ సింగ్ బుల్లార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
న్యూఢిల్లీ: పంజాబ్ పోలీసు శాఖలో రోపర్ రేంజ్‌కు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్‌గా పనిచేస్తున్న హర్చరణ్ సింగ్ బుల్లార్‌ను ఇవాళ సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. మొహాలీ ఆఫీసు నుంచి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అవినీతి కేసు(Corruption Case)లో హర్చరణ్ సింగ్ బుల్లార్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఇదే కేసులో మరో ప్రైవేటు వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. హర్చరణ్ బుల్లార్ ఆఫీసుతో పాటు ఇళ్లు, ఇతర ప్రదేశాల్లోనూ సోదాలు జరిగాయి.
రోపర్ రేంజ్ డీఐజీ బుల్లార్‌ను పంచకులకు తీసుకెళ్లారు. ఆ తర్వాత ఆయన్ను మళ్లీ వెనక్కి తీసుకువచ్చారు. ఫతేఘర్‌కు చెందిన ఓ స్క్రాప్ డీలర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా చండీఘడ్‌లోని సీబీఐ అధికారులు డీఐజీని అరెస్టు చేశారు. అయితే బుల్లార్ అరెస్టు గురించి సీనియర్ పోలీసు అధికారులు ఎటువంటి విషయాన్ని వెల్లడించడం లేదు.
2024, నవంబర్ 27వ తేదీన రోపర్ రేంజ్ డీఐజీగా బుల్లార్ బాధ్యతలు స్వీకరించారు. దానికి ముందు ఆయన పాటియాలా రేంజ్ డీఐజీగా చేశారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా సాగిన యుద్ద్ నషేయాన్ విరుద్ కార్యక్రమంలో చురుకుగా ఆయన పాల్గొన్నారు. పంజాబ్ మాజీ డీజీపీ మెహల్ సింగ్ బుల్లార్ కుమారుడే హర్చరన్ సింగ్ బుల్లార్. డ్రగ్ స్మగ్లింగ్ కేసులో అకాళీ నేత బిక్రం సింగ్ మంజితాను విచారించిన బృందానికి సిట్ అధిపతిగా చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | జపాన్‌లోనూ డార్లింగ్ మానియా .. తెలుగులో విషెస్ చెప్పిన విదేశీ అభిమానులు
Multi Starrer | 40 ఏళ్ల నిరీక్షణకు తెర పడనుందా .. రజినీకాంత్–కమల్ హాసన్‌తో నెల్సన్ భారీ మల్టీస్టారర్!
Scene | సూర్య ‘సీన్’ చిత్రంలో విలన్‌గా నస్లేన్.. గ్లింప్స్ విడుదల!
The Paradise | విమర్శలు ఎదురైన తగ్గేదేలే.. నెట్‌ఫ్లిక్స్‌లో నంబర్ వన్‌గా ‘ది ప్యారడైజ్’, నాని ఖాతాలో మరో రికార్డు!
Shaurya Commandos: శౌర్య కమాండోలను రంగంలోకి దింపిన ఐటీబీపీ
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

