కెయిర్న్ ఆర్బిట్రేషన్ కేసు: ఫ్రెంచ్ కోర్టు తీర్పును ధృవీకరించిన భారత ప్రభుత్వం
Cairn Arbitration case: ఫ్రాన్స్ రాజధాని పారిస్లోగల భారతదేశ ఆస్తులను బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ సంస్థ స్వాధీనం చేసుకోవచ్చంటూ గతంలో ఫ్రెంచ్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని భారత ప్రభుత్వం

న్యూఢిల్లీ: ఫ్రాన్స్ రాజధాని పారిస్లోగల భారతదేశ ఆస్తులను బ్రిటన్‌కు చెందిన కెయిర్న్ ఎనర్జీ సంస్థ స్వాధీనం చేసుకోవచ్చంటూ గతంలో ఫ్రెంచ్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని భారత ప్రభుత్వం ధృవీకరించింది. ఈ విషయమై రాజ్యసభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ ఛౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నిజమే సార్, పారిస్‌లోని భారత ఆస్తులను కెయిర్న్ ఎనర్జి సంస్థ స్వాధీనం చేసుకోవచ్చంటూ ఫ్రెంచ్ కోర్టు ఆదేశాలు ఇచ్చింది అని పంకజ్ ఛౌదరి తన సమాధానంలో పేర్కొన్నారు.
బ్రిటన్ ఇంధన సంస్థ కెయిర్న్ ఎనర్జీకి, భారత ప్రభుత్వానికి మధ్య నెలకొన్న రెట్రోస్పెక్టివ్ పన్ను వివాదంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ (ఆర్బిట్రేషన్) న్యాయస్థానం కెయిర్న్ ఎనర్జీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. భారత్ అడిగినట్టు కెయిర్న్ ఎనర్జీ పన్నులు చెల్లించాల్సిన అవసరంలేదని పేర్కొన్నది. ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నుంచి తమకు 1.72 బిలియన్ డాలర్ల పరిహారాన్ని ఇప్పించాలని కోరుతూ కెయిర్న్ ఎనర్జీ అమెరికా, యూకే, నెదర్లాండ్స్ న్యాయస్థానాల్లో దావాలు వేసింది.
ఈ క్రమంలోనే గత నెల 11న ఫ్రెంచ్ కోర్టు కెయిర్న్ ఎనర్జీ పిటిషన్‌పై విచారణ జరిపింది. అంతర్జాతీయ మధ్యవర్తిత్వ న్యాయస్థానం తీర్పు మేరకు పారిస్‌లో ఉన్న భారత ఆస్తులను కెయిర్న్ ఎనర్జి సంస్థ స్వాధీనం చేసుకోవచ్చని తీర్పు వెలువరించింది. అయితే, ఈ తీర్పు విషయంలో స్పష్టత కోరుతూ రాజ్యసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు.. భారత ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. పారిస్‌లోని భారత ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చంటూ కెయిర్న్ ఎనర్జీకి ఫ్రెంచ్ కోర్టు అనుమతి ఇచ్చిన మాట నిజమేనని స్పష్టంచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

