Biryani | ఈ ఐపీఎల్(ఇండియన్ ప్రీమియర్ లీగ్) సీజన్ క్రికెట్ లవర్స్‌కు సరికొత్త అనుభూతిని ఇచ్చింది. నిన్న జరిగిన హోరాహోరీ పోరులో గుజరాత్ టైటాన్స్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఓడించి.. కప్‌ను తన ఖాతాలో వేసుకుంది. ఆ క్షణాలను చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులు ఎంజాయ్ చేశారు. ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కప్ గెలవడం ఇది ఐదోసారి. సీఎస్కే కప్ కైవసం చేసుకోవడం పక్కన పెడితే.. ఈ ఐపీఎల్ సీజన్లో ఏ ఫుడ్‌కు ఎక్కువ ఆర్డర్లు లభించాయో తెలుసా..?
ఐపీఎల్ 2023 షెడ్యూల్ మొత్తంలో బిర్యానీకి అత్యధికంగా ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ ప్రకటించింది. నిమిషానికి 212 బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్లు పేర్కొంది. అయితే వెజ్ లేదా నాన్ వెజ్ బిర్యానా? అనే విషయంపై స్విగ్గీ స్పష్టత ఇవ్వలేదు. కానీ మొత్తంగా బిర్యానీ ఆర్డర్లు మాత్రం భారీగా వచ్చాయని తెలిపింది.
2023 న్యూ ఇయర్ ఈవ్ రాత్రి.. ఏకంగా 3.5లక్షల బిర్యానీలు అమ్ముడుపోయిన సంగతి తెలిసిందే. మరే ఇతర వంటకాలు కూడా బిర్యానీ దరిదాప్పుల్లో లేవు. న్యూ ఇయర్ ఈవ్ నాడు.. ఒక్క హైదరాబాద్ నుంచి 75.4 శాతం బిర్యానీ ఆర్డర్లు వచ్చినట్టు స్విగ్గీ నిర్వహించిన ట్విట్టర్ పోల్‌లో తేలింది. ఆ తర్వాతి స్థానంలో లక్నో (14.2శాతం), కోల్‌కతా (10.4శాతం) ఉన్నాయి.