NEET paper leak | తేజస్వి అనుచరుడికి నీట్ పేపర్ లీక్‌తో సంబంధం.. బీహార్ డిప్యూటీ సీఎం ఆరోపణ
NEET paper leak | బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనుచరుడికి నీట్ పేపర్ లీక్‌తో సంబంధం ఉందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఈ విషయంపై డిపార్ట్మెంటల్ విచారణ జరిపినట్లు తెలిపారు.
పాట్నా: బీహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ అనుచరుడికి నీట్ పేపర్ లీక్‌తో (NEET paper leak) సంబంధం ఉందని ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం విజయ్ కుమార్ సిన్హా ఆరోపించారు. ఈ విషయంపై డిపార్ట్మెంటల్ విచారణ జరిపినట్లు తెలిపారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన తేజస్వి యాదవ్ వ్యక్తిగత కార్యదర్శి ప్రీతం కుమార్ బీహార్ రోడ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ (ఆర్సీడీ) ఉద్యోగి ప్రదీప్‌తో మాట్లాడినట్లు తెలిపారు. సికందర్ ప్రసాద్ యాదవెందు అనే ఇంజినీర్ కోసం ఎన్హెచ్ఏఐ గెస్ట్ హౌస్‌లో రూమ్ బుక్ చేయమని అతడు చెప్పాడని అన్నారు.
కాగా, ఈ విషయంపై డిపార్ట్మెంటల్ విచారణ జరిపినట్లు విజయ్ కుమార్ సిన్హా తెలిపారు. ప్రదీప్‌కు ఫోన్ చేసిన ప్రీతం కుమార్ కాల్ వివరాలు ఉన్నాయని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని తాను డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ‘వారు అధికారంలో లేరు. అయితే లక్షల మంది అభ్యర్థుల భవిష్యత్తుతో ఆడుకోవాలని చూస్తున్నారు’ అని సిన్హా విమర్శించారు. రూమ్ బుకింగ్‌కు సంబంధించి ప్రదీప్‌తో సహా రోడ్డు నిర్మాణ విభాగానికి చెందిన ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్లు ఆయన వెల్లడించారు.
మరోవైపు నీట్ నిందితులు తమ గెస్ట్ హాస్‌లో బస చేసినట్లుగా వచ్చిన ఆరోపణలను ఎన్హెచ్ఏఐ ఖండించింది. పాట్నాలో తమకు గెస్ట్ హౌస్ సౌకర్యం లేదని ప్రకటించింది. ‘నీట్ పేపర్ లీక్ కేసుకు సంబంధించిన నిందితులు పాట్నాలోని ఎన్హెచ్ఏఐ గెస్ట్ హౌస్‌లో బస చేసినట్లు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. ఎన్హెచ్ఏఐకి పాట్నాలో గెస్ట్ హౌస్ సౌకర్యం లేదని స్పష్టం చేస్తున్నాం’ అని పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Aide
- Bihar Deputy CM
- linked
- neet
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

