IMF on India Wheat Ban | గోధుమల ఎగుమతిపై నిషేధం ఎత్తేయండి.. భారత్‌కు ఐఎంఎఫ్ వేడుకోళ్లు!
IMF on India Wheat Ban | ప్రపంచదేశాలకు గోధుమల ఎగుమతిపై నిషేధం ఎత్తేయాలని భారత్‌ను ఐఎంఎఫ్ అభ్యర్థించింది.
IMF on India Wheat Ban | ప్రపంచ దేశాలకు గోధుమలను ఎగుమతి చేయకుండా నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని భారత్‌ను అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అభ్యర్థించింది. అంతర్జాతీయ ఆహార భద్రత, ప్రపంచ సుస్థిరతతో భారత్ కీలక పాత్ర పోషించాలని ఐఎంఎఫ్ చీఫ్ క్రిష్టాలినా జార్జియోవా మంగళవారం పేర్కొన్నారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో పాల్గొనేందుకు వచ్చిన క్రిష్టాలినా జార్జియోవా ఓ ఆంగ్ల టీవీ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దాదాపు 135 కోట్ల మంది పౌరులకు ఆహార ధాన్యాలు సరఫరా చేయాల్సిన అవసరం ఉన్నందుకు భారత్‌ను అభినందిస్తున్నానని చెప్పారు.
కానీ వేడి వాతావరణం వల్ల ఆహార ధాన్యాల దిగుబడులు తగ్గాయని క్రిష్టాలినా ఆందోళన వ్యక్తం చేశారు. పలు దేశాలు ఇతర దేశాలకు గోధుమల ఎగుమతిపై నిషేధం విధిస్తున్నాయని గుర్తు చేశారు. కనుక భారత్ తన నిషేధాన్ని పునః పరిశీలించాలని భారత్‌ను అభ్యర్థిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం ప్రభావం నేపథ్యంలో ఈజిప్ట్, లెబనాన్ వంటి దేశాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ఆహార ధాన్యాలు లేక ఆ రెండు దేశాల్లో అశాంతి నెలకొంటుందన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

