Bee warriors | భారత్-బంగ్లా సరిహద్దుల్లో తేనెటీగల కాపలా.. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన బీఎస్ఎఫ్..!
Bee warriors | భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి మన దేశంలోకి అక్రమ చొరబాట్లు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో చొరబాట్లను కట్టడిచేసేందుకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తేనెటీగల సాయంతో చొరబాట్లను అడ్డుకునేందుకు సన్నాహాలు చేస్తున్నది.
న్యూఢిల్లీ: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి మన దేశంలోకి అక్రమ చొరబాట్లు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో చొరబాట్లను కట్టడిచేసేందుకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. తేనెటీగల సాయంతో చొరబాట్లను అడ్డుకునేందుకు సన్నాహాలు చేస్తున్నది. పైలట్ ప్రాజెక్టుగా ఈ కార్యక్రమాన్ని చేపట్టిన బీఎస్ఎఫ్.. ప్రయోగం విజయవంతమైతే పెద్ద ఎత్తున తేనెటీగల పెంపకాన్ని చేపట్టేందుకు సిద్ధమైంది.
బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి తరచూ భారత్‌లోకి చొరబాట్లు చోటుచేసుకున్నాయి. అక్రమంగా దేశంలోకి వస్తున్న వారిని సరిహద్దు భద్రతా బలగాలు నిలువరిస్తున్నప్పటికీ.. వారి కన్నుగప్పి ఏదో ఒక చోటు నుంచి దేశంలోకి చొరబడే వాళ్లు చొరబడుతూనే ఉన్నారు. అందుకే ఈ చొరబాట్ల కట్టడికి తేనెటీగలను వినియోగించుకుంటే బాగుంటుందేమోనని బీఎస్ఎఫ్ ప్లాన్ చేసింది. ప్లాన్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వ చొరవతో ఇప్పటికే బార్డర్లో తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించింది.
పైలట్ ప్రాజెక్ట్‌లో భాగంగా బీఎస్ఎఫ్ భారత్-బంగ్లాదేశ్ మధ్య 4.96 కిలోమీటర్ల పొడవున ముళ్ల కంచెను ఏర్పాటు చేసింది. ఈ ముళ్ల కంచె వెంబడి బాక్సులను ఏర్పాటు చేసి వాటిలో తేనెటీగలను పెంచాలని బీఎస్ఎఫ్ లక్ష్యంగా పెట్టుకున్నది. అందుకోసం తేనెటీగలకు అవసరమైన మకరందాన్ని ఇచ్చే కొన్ని రకాల పూల మొక్కలను ఆ ముళ్ల కంచెలో పెంచుతున్నారు. తేనెటీగలకు ఉపయోగపడే సహజ వాతావరణాన్ని సరిహద్దులో సృష్టిస్తున్నారు.
కాగా భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంట ముళ్ల కంచె మీద ఏర్పాటు చేసే ఈ బాక్సుల నిర్వహణ బాధ్యతను స్థానిక గ్రామాల ప్రజలకు అప్పగించనున్నట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. ఆయా బాక్సులలో తేనెటీగలు నిలువచేసే తేనెను సేకరించుకునే అవకాశాన్ని కూడా వారికే కల్పించనున్నామని చెప్పారు. ఈ వినూత్న పద్ధతిని అమలు చేయడానికి పెద్దగా ఖర్చు ఉండదని, పైగా తేనె సేకరణ ద్వారా సరిహద్దు గ్రామాల ప్రజలకు ఆదాయం వస్తుందని అంటున్నారు.
చొరబాటుదారులను తేనెటీగలు ఎలా కట్టడిచేస్తాయి..?
సరిహద్దుల్లోని ముళ్ల కంచె వెంట తేనేతీగలను పెంచే బాక్సులను ఉంచడంవల్ల చొరబాటుదారులు ముళ్లకంచెను తాకగానే అది ఊగుతుందని, దాంతో ఆ బాక్సుల్లోని తేనేటీగలు బయటికి వచ్చి చొరబాటుదారులను తరిమేస్తాయని బీఎస్ఎఫ్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రాజెక్టు విజయవంతమైతే రాబోయే రోజుల్లో మిగతా సరిహద్దుల్లోనూ తేనెటీగల రక్షణ ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Trisha | జయలలిత పాత్రలో త్రిష.. ఎంజీఆర్ బయోపిక్‌లో కీలక పాత్రకు ఓకే చెప్పిందా!
Glacial Lake Outburst | భూటాన్‌లో హిమానీనదం విస్ఫోటనం.. బెంగాల్, అస్సాంలకు వరద ముప్పు.. కేంద్రం హైఅలర్ట్..!
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబం ట్విట్టర్ రివ్యూ.. వెంకీ కామెడీకి ప్రశంసలు, త్రివిక్రమ్ మ్యాజిక్ వర్కౌట్ అయిందా?
Throat problem | గొంతులో నొప్పి, మంట, గరగర వేధిస్తున్నాయా.. అయితే ఈ వంటింటి చిట్కా మీ కోసమే..!
Vishwak Sen | ఫ్యాన్స్ మీట్ వివాదంపై మరోసారి స్పందించిన విశ్వక్ సేన్.. ఆ రోజు జరిగిన తప్పుకు క్షమాపణలు!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

