Atiq Ahmed | అతిక్ అనుచరులు తుపాకీతో బెదిరించి పది లక్షలు డిమాండ్ చేశారు.. న్యాయవాది ఫిర్యాదు
Atiq Ahmed | బంధువుల భూమిని అమ్మేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు న్యాయవాది వకార్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా అతిక్ అహ్మద్ అనుచరులైన అసద్ కలియా, ఇర్షాద్ ఫన్నూ తనను తుపాకీతో బెదిరించారని, పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.
లక్నో: గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ (Atiq Ahmed) అనుచరులు తనను తుపాకీతో బెదిరించి పది లక్షలు డిమాండ్ చేశారని ఒక న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో అతిక్ అనుచరులతోపాటు మరో నలుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు చెందిన న్యాయవాది వకార్ అహ్మద్, గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్‌పై ఆరోపణలు చేశారు. ఆయన అనుచరులు గన్ పాయింట్‌తో తనను బెదిరించి పది లక్షలు డిమాండ్ చేసినట్లు కరేలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
బంధువుల భూమిని అమ్మేందుకు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు న్యాయవాది వకార్ అహ్మద్ తెలిపారు. ఈ సందర్భంగా అతిక్ అహ్మద్ అనుచరులైన అసద్ కలియా, ఇర్షాద్ ఫన్నూ తనను తుపాకీతో బెదిరించారని, పది లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వారి నుంచి తన ప్రాణాలకు, ఆస్తికి ముప్పు ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో గ్యాంగ్‌స్టర్ అతిక్ అహ్మద్ అనుచరులైన అసద్, ఇర్షాద్తోపాటు గుర్తు తెలియని మరో నలుగురిపై పలు సెక్షన్ల కింద పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. డబ్బుల కోసం న్యాయవాదిని వారు గన్‌తో బెదిరించడంపై దర్యాప్తు చేస్తున్నారు.
కాగా, 2005లో జరిగిన బీఎస్పీ ఎమ్మెల్యే రాజుపాల్ హత్య కేసులో ప్రధాన సాక్షి అయిన ఉమేష్ పాల్‌ను 2006లో కిడ్నాప్ చేశారు. ఈ కేసులో అతిక్ అహ్మద్‌కు ప్రయాగ్‌రాజ్ కోర్టు మార్చి 28న జీవిత ఖైదు విధించింది. మరో ఇద్దరిని కూడా దోషులుగా నిర్ధారించింది. అయితే అతిక్ అహ్మద్ సోదరుడు అష్రఫ్‌కు విముక్తి లభించింది.
మరోవైపు ఈ ఏడాది ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో ఇంటి వద్ద కారు దిగుతుండగా కీలక సాక్షి అయిన ఉమేష్ పాల్‌పై కొందరు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. జైల్లో ఉన్న అతిక్ అహ్మద్, అతడి సోదరుడు ఈ హత్యకు కుట్ర పన్నినట్లు ఉమేష్ పాల్ కుటుంబం ఆరోపించింది. దీంతో పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- aides
- Atiq Ahmed
- demand
- Gunpoint
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

