ఊరట : ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్‌తో బ్లడ్కాట్స్ ముప్పు లేదు!

లండన్ : వృద్ధుల్లో కరోనా కట్టడిలో తమ వ్యాక్సిన్ 80 శాతం సామర్ధ్యం కలిగిఉందని ఆస్ట్రాజెనెకా ప్రకటించింది. తమ వ్యాక్సిన్ వాడకంతో బ్లడ్ క్లాట్స్ ముప్పు పెరగబోదని కంపెనీ స్పష్టం చేసింది. అమెరికాలో ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ మూడవ దశ పరీక్షల్లో భాగంగా కంపెనీ వ్యాక్సిన్ సామర్ధ్యంపై ప్రకటన చేసింది. మొత్తం జనాభాలో కొవిడ్-19 లక్షణాలను తమ వ్యాక్సిన్ 79 శాతం నిరోధిస్తుందని, కరోనా మహమ్మారితో తీవ్ర అనారోగ్యం, ఆస్పత్రిపాలవడాన్ని నూటికి నూరు శాతం నిరోధిస్తుందని ఆస్ట్రాజెనెకా తెలిపింది.
గత పరీక్షల్లో వయోవృద్ధులు ఎంతమంది వ్యాక్సిన్ ఇచ్చారనే డేటా కొరవడటం, ఈ వ్యాక్సిన్‌తో బ్లడ్ క్లాట్స్ ముప్పు పెరుగుతుందనే ఆందోళనతో పలు దేశాలు వృద్ధులకు ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ ఇవ్వడం నిలిపివేసిన నేపథ్యంలో కంపెనీ ఈ ప్రకటన చేసింది. అమెరికాలో మూడో దశ పరీక్షల్లో భాగంగా ఆస్ట్రాజెనెకా-ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను దాదాపు 11,000 మందిపై పరీక్షించారు. వీరిలో 20 శాతం మంది 65 ఏండ్ల వయస్కులు కాగా వీరిలో 60 శాతం మంది మధుమేహం, స్ధూలకాయం, గుండె జబ్బులు వంటి తీవ్ర వ్యాధులతో బాధపడుతున్నారు.అయితే వీరిలో కరోనాను నిలువరించే వ్యాక్సిన్ సామర్ధ్యం 80 శాతంగా గుర్తించామని ఆస్ట్రాజెనెకా పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

