Arvind Kejriwal: 3 పుస్తకాలు చదువుకునేందుకు కేజ్రీవాల్ దరఖాస్తు.. ఆ పుస్తకాలు ఏంటంటే?
Arvind Kejriwal: భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అన్న పుస్తకాలను చదువుకునేందుకు అనుమతి ఇవ్వాలని అరవింద్ కేజ్రీవాల్ న్యాయవాదులు ఢిల్లీ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం మద్యం పాలసీ కేసులో ఆయన్ను ఏప్రిల్ 15వ తేదీ వరకు కస్టడీ విధించిన విషయం తెలిసిందే.
న్యూఢిల్లీ: మద్యం పాలసీ కేసులో ఇవాళ ఢిల్లీ కోర్టు సీఎం కేజ్రీవాల్‌ను ఏప్రిల్ 15వ తేదీ వరకు జుడిషియల్ కస్టడీకి పంపింది. స్పెషల్ జడ్జి కావేరి బవేజా .. రౌజ్ అవెన్యూ కోర్టులో ఆ ఆదేశాలు ఇచ్చారు. అయితే ఇవాళ అరవింద్ కేజ్రీవాల్ న్యాయవాదులు కోర్టులో ప్రత్యేక అప్లికేషన్ దాఖలు చేశారు. మూడు పుస్తకాలు చదువుకునేందుకు కేజ్రీవాల్‌కు అనుమతి ఇవ్వాలని న్యాయవాదులు కోరారు. భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ అన్న పుస్తకాలు కేజ్రీవాల్ చదువుకుంటారని ఆయన తరపున న్యాయవాదులు కోర్టులో తెలిపారు. ప్రస్తుతం జుడిషియల్ రిమాండ్‌కు వెళ్లిన కేజ్రీవాల్ మరో 15 రోజుల పాటు జైల్లోనే ఉండనున్నారు. ఆ సమయంలో బహుశా ఆయన ఈ పుస్తకాలు చదువుతారో ఏమో అన్న డౌట్స్ వ్యక్తం అవుతున్నాయి. మద్యం పాలసీ కేసుతో లింకున్న మనీల్యాండరింగ్ కేసులో కేజ్రీవాల్ ప్రధాన నిందితుడు అని ఈడీ ఆరోపిస్తున్నది. ఆయన్ను మార్చి 21వ తేదీన అరెస్టు చేశారు. హౌ ప్రైమ్‌మినిస్టర్స్ డిసైడ్ అన్న పుస్తకాన్ని జర్నలిస్టు నీరజ్ చౌదరీ రాశారు. ప్రధానులు ఎలా కీలకమైన నిర్ణయాలను తీసుకున్నారో ఆ పుస్తకంలో ఆయన విశిదపరిచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs WI | శాంసన్ మెరుపు ఫిఫ్టీ.. పవర్ ప్లేలో విండీస్‌పై రికార్డు స్కోర్..!
పోలీసు సిబ్బందికి సేవా పతకాలు
Botsa Satyanarayana | బీసీలను మరోసారి మోసం చేసిన చంద్రబాబు : బొత్స సత్యనారాయణ
Asian Hockey Championships | పాకిస్థాన్‌కు మరో ఎదురుదెబ్బ.. ఈసారి టోర్నీకి ముందే దాయాది ఔట్..!
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

