అగ్నిగుండంగా అరుణాచల్ ప్రదేశ్!
ప్రతిపాదిత 11,200 మెగావాట్ల సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అరుణాచల్ ప్రదేశ్‌లో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి.
- హైడ్రోపవర్ ప్రాజెక్టు వ్యతిరేక నిరసనల్లో హింసాకాండ
- ఎన్‌హెచ్‌పీసీ ఆఫీసు, పోలీసు స్టేషన్ దగ్ధం
- రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడి ఇల్లు ధ్వంసం
న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ప్రతిపాదిత 11,200 మెగావాట్ల సియాంగ్ అప్పర్ మల్టీపర్పస్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా అరుణాచల్ ప్రదేశ్‌లో జరుగుతున్న నిరసనలు హింసాత్మకంగా మారాయి. మధ్య ఈస్ట్ సియాంగ్ జిల్ల్లాలో మూకలు ఎన్‌హెచ్‌పీసీ కార్యాలయాన్ని, పోలీసు స్టేషన్‌ను దగ్ధం చేయడంతో పాటు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సహా ఇద్దరు రాజకీయ నాయకుల నివాసాలపై దాడి చేసి ధ్వంసం చేసినట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు.
పాసిఘాట్‌లో నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారని ఆయన తెలిపారు. జలవిద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చేపట్టిన 12 గంటల బంద్ ముగిసిన తర్వాత శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ఈ విధ్వంసకర ఘటనలు జరిగాయని పాసిఘాట్ డీఎస్పీ టోనీ టాటక్ తెలిపారు. బీజేపీ రాష్ట్ర విభాగం అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాలింగ్ మోయోంగ్, అలాగే పాసిఘాట్ పశ్చిమ శాసనసభ్యుడు నినోంగ్ ఎరింగ్ నివాసాలపై ఆందోళనకారులు దాడి చేసి ధ్వంసం చేశారని ఆయన చెప్పారు.
ఆది సమాజానికి అత్యున్నత సంస్థ అయిన ఆది బేనే కేబాంగ్ కార్యాలయం కూడా ధ్వంసం అయినట్టు చెప్పారు. విద్యుత్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా జరిగిన బంద్ సందర్భంగా సియాంగ్ జిల్లాలో నిరసనకారులు పోలీసులతో ఘర్షణ పడటంతో ఆందోళనకారులను చెదరగొట్టడానికి భద్రతా దళాలు బాష్పవాయువును ప్రయోగించాయని ఆయన చెప్పారు. 150-200 మంది నిరసనకారులు భధ్రతా సిబ్బందిపై రాళ్లు రువ్వారని అధికారులు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

