Arrest | నీట్ పేపర్ లీకేజీ కేసు.. ప్రధాన నిందితుడి అరెస్ట్
Arrest | నీట్ యూజీ - 2024 (NEET UG - 2024)’ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన సంజీవ్ ముఖియా (Sanjeev Mukhiya) ను ఆర్థిక నేర విభాగం (EOU) బృందం అరెస్టు చేసింది.
Arrest : ‘నీట్ యూజీ – 2024 (NEET UG – 2024)’ ప్రవేశ పరీక్ష పేపర్ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన సంజీవ్ ముఖియా (Sanjeev Mukhiya) ను ఆర్థిక నేర విభాగం (EOU) బృందం అరెస్టు చేసింది. గురువారం రాత్రి అతడిని బీహార్ (Bihar) రాజధాని పట్నా (Patna) లో అరెస్టు చేశామని ఈవోయూ అధికారి నయ్యర్ హుస్సేన్ ఖాన్ వెల్లడించారు.
నీట్ పేపర్ లీకేజీ కేసులో సంజీవ్ ముఖియా ప్రధాన నిందుతుడు. పేపర్ లీకేజీ అంశం బయటపడగానే అతడు పరారయ్యాడు. అతడిని పట్టుకునేందుకు బీహార్ ప్రభుత్వం ఇటీవల సంజీవ్‌పై రూ.3 లక్షల నజరానా ప్రకటించింది. ఈ క్రమంలోనే అతడు పట్నాలోని ఒక అపార్టుమెంట్లో ఉన్నట్లు సమాచారం అందడంతో అధికారులు అక్కడికి వెళ్లి అతడిని అరెస్టు చేశారు. ముఖియా అరెస్టుతో పేపర్ లీకేజీతో సంబంధం ఉన్న మరింత మంది వ్యక్తుల పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది.
బీహార్‌లోని నలందా జిల్లా నాగర్సోనా ప్రాంతానికి చెందిన సంజీవ్ తొలుత సాబూర్ అగ్రికల్చర్ కాలేజీలో పని చేసేవాడు. అక్కడ పేపర్ లీక్ చేసినట్లు ఆరోపణలు రావడంతో 2016లో అతడిపై వేటువేశారు. ఆ కేసులో కొన్నాళ్ల పాటు జైలుశిక్ష కూడా అనుభవించాడు. అనంతరం నలందా కాలేజీ నూర్‌సరయ్ బ్రాంచ్‌లో టెక్నికల్ అసిస్టెంట్‌గా చేరాడు. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై మధ్యవర్తులు, విద్యార్థులు సహా 14 మందిని బీహార్ పోలీసులు అరెస్టు చేసి విచారించగా.. సంజీవ్ ముఖియా పేరు ప్రధానంగా బయటకొచ్చింది.
కాగా సంజీవ్ కుమారుడు శివ్‌కుమార్‌కూ ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్నట్లు తేలింది. అతడు బీహార్ ఉపాధ్యాయ నియామక పరీక్ష పేపర్ లీక్ కేసులో అరెస్టయ్యి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. వీరిద్దరూ ‘ముఖియా సాల్వర్ గ్యాంగ్’ పేరుతో ఓ ముఠాను ఏర్పాటు చేసినట్లు తెలిసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

