కొవిడ్ రూల్స్ బ్రేక్.. మరో మార్కెట్ మూసివేత
మార్కెట్ మూసివేత| దేశ రాజధానిలో కరోనా కేసులు తగ్గడంతో కొవిడ్ ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. అయితే కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి, కరోనా నిలయాలుగా మారుతున్న మార్కెట్లపై ప్రభుత్వం కొరఢా ఝులిపిస్తున్నది.

న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా కేసులు తగ్గడంతో కొవిడ్ ఆంక్షలను ప్రభుత్వం తొలగించింది. అయితే కరోనా కట్టడికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలను పాటించాలని ఆదేశించింది. ఈ నిబంధనలను ఉల్లంఘించి, కరోనా నిలయాలుగా మారుతున్న మార్కెట్లపై ప్రభుత్వం కొరఢా ఝులిపిస్తున్నది. మొన్న కరోనా రూల్స్ పాటించని జనపథ్ మార్కెట్‌పై నిషేధం విధించిన కేజ్రివాల్ సర్కార్.. తాజా సుల్తాన్‌పురి మార్కెట్‌పై ఆంక్షలు విధించింది. కరోనా కట్టడి నియమాలు పాటించకపోవడంతో సుల్తాన్పూర్ సబ్జీ మండీని మూసివేయాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (డీడీఎంఏ) అధికారులు ఆదేశాలు జారీచేశారు. మార్కెట్లో భౌతిక దూరం పాటించనందున సబ్జీ మండీని ఈ నెల 16 వరకు మూలివేయాలని అందులో పేర్కొన్నారు. ఇదేవిధంగా కొవిడ్ ప్రొటోకాల్ ఉల్లంఘించిన రాణీ బాగ్ బజార్‌ను కూడా మూసివేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | లింగన్నపేట బ్రహ్మోత్సవాల్లో కేటీఆర్‌కు ఘనస్వాగతం.. వీడియో
Vande Bharat Sleeper: రెండు కొత్త వందేభారత్ స్లీపర్ రైళ్లు.. రూటు, టైమింగ్ వివరాలు ఇవే
కోతుల బెడద నివారణకు చర్యలు.. సర్పంచ్, ఉప సర్పంచ్‌కు కాలనీవాసుల సన్మానం
ఉద్యమకారుల ముందస్తు అరెస్టు
‘ఈ 31న జరిగే టీపీఎఫ్ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

