లక్నో: సోదరుడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్తానిని భార్య పట్టుబట్టింది. ఆగ్రహించిన భర్త ఆమె ముక్కు కోశాడు. (Husband Cuts Wife’s Nose) తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. బనియాని పూర్వాలో నివసిస్తున్న రాహుల్, 25 ఏళ్ల అనిత భార్యాభర్తలు. వారిద్దరి మధ్య తరచుగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో పుట్టింటికి వెళ్లిన అనిత నాలుగు రోజుల కిందట భర్త ఇంటికి వచ్చింది. అయితే సోదరుడికి రాఖీ కట్టేందుకు తన పుట్టింటికి వెళ్తానని భర్త రాహుల్కు ఆదివారం చెప్పింది. దీంతో వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన అతడు అనిత ముక్కు కోశాడు.
కాగా, మహిళ కేకలు విన్న ఆమె బావ వెంటనే అక్కడకు చేరుకున్నాడు. ముక్కు తెగడంతో రక్తపు మడుగులో పడి ఉన్న అనితను హర్దోయ్ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అడ్మిట్ చేశాడు. మెరుగైన చికిత్స కోసం లక్నోలోని ట్రామా సెంటర్కు డాక్టర్లు రిఫర్ చేయడంతో ఆమెను అక్కడకు తరలించారు.
మరోవైపు ముక్కు కోసిన భర్త రాహుల్పై అనిత ఆగ్రహం వ్యక్తం చేసింది. తన కష్టాలను వెల్లబోసుకుంది. ఇక బతకడం ఇష్టం లేదని చెప్పింది. తన భర్తపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆ మహిళ మాట్లాడిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
तू घर जाना चाहती है… जा.. तेरी नाक काट देता हूं…
हरदोई में अनीता अपने भाई को राखी बांधने के लिए मायके जाना चाहती थी। पति राहुल ने मना किया तो दोनों में झगड़ा हो गया। राहुल ने अनीता को मारा पीटा और अंत में उसकी नाक काट दी। pic.twitter.com/p2GSIoJxev
— Kavish Aziz (@azizkavish) August 19, 2024