Hathras Stampede | తొక్కిసలాట ఘటన బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలి : యూపీ కాంగ్రెస్ చీఫ్
Hathras Stampede : యూపీలోని హథ్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోగా, 28 మంది గాయపడిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది.
Hathras Stampede : యూపీలోని హథ్రాస్‌లో జరిగిన తొక్కిసలాటలో 121 మంది ప్రాణాలు కోల్పోగా, 28 మంది గాయపడిన ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. భారీస్ధాయిలో జనం హాజరయ్యే ఈ కార్యక్రమానికి నిర్వాహకులకు అనుమతించడం ద్వారా ప్రభుత్వం సునిశితంగా వ్యవహరించలేదని యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ రాయ్ ఆరోపించారు. ఈ కార్యక్రమ నిర్వాహకులతో పాటు బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారంతో పాటు బాధిత కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని కోరారు. క్షతగాత్రులకు రూ. 25 లక్షలు పరిహారం అందచేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక హథ్రాస్ తొక్కిసలాట ఘటన బాధితులను అజయ్ రాయ్ బుధవారం పరామర్శించారు. బాధిత కుటుంబాలు ధైర్యంగా ఉండాలని భరోసా ఇచ్చారు. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు బాసటగా ఉంటామని అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇక యూపీలోని హాథ్రాస్‌లో జరిగిన భోలే బాబా(Bhole Baba) సత్సంగ్‌లో విషాదం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. ఇంత పెద్దసంఖ్యలో ఓ ఆథ్యాత్మిక కార్యక్రమం జరుగుతున్నా ఆస్ధాయిలో పోలీసులు బందోబస్తు ఏర్పాట్లు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. తొక్కిసలాటలో దాదాపు 121 మంది మరణించారు. ఈ ఘటనకు బాధ్యులైన బాబా ఆచూకీ అంతుబట్టడం లేదు. మంగళవారం మధ్యాహ్నం 3.30 నిమిషాలకు .. సత్సంగ్ ప్రాంగణం వద్ద తొక్కిసలాట జరిగింది. కానీ ఆ ఘటన తర్వాత భోలే బాబా ఆనవాళ్లు దొరకడం లేదు. ఆయన పరారీలో ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
Read More :
MUDA Irregularities Case | రాజీనామా డిమాండ్‌ను తోసిపుచ్చిన సిద్ధరామయ్య
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

