Air Asia: ఎయిర్ ఏషియాకు 20 లక్షల జరిమానా విధించిన డీజీసీఏ
Air Asia : ఎయిర్ ఏషియా సంస్థకు 20 లక్షల ఫైన్ వేశారు. పైలట్ శిక్షణ సరిగా లేదని ఆ సంస్థకు జరిమానా విధించారు. డీజీసీఏ ఈ ఫైన్ వేసింది.
న్యూఢిల్లీ: ఎయిర్ ఏషియా విమానయాన సంస్థకు 20 లక్షల జరిమానా విధించారు. పైలట్ శిక్షణలో లోపం ఉన్నట్లు ఏవియేషన్ రెగ్యులేటరీ డీజీసీఏ సంస్థ పేర్కొన్నది. పైలట్ నైపుణ్యం చెకింగ్ సమయంలో ఎయిర్ ఏషియా పైలట్ తన స్కిల్స్‌ను ప్రదర్శించలేకపోయినట్లు డీజీసీఏ తెలిపింది. అంతర్జాతీయ సివిల్ ఏవియేషన్ సంస్థ రూల్స్ ప్రకారం ఆ పైలట్ పర్ఫార్మ్ చేయలేకపోయాడు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో ఎయిర్ ఏషియాపై డీజీసీఏ జరిమానా వేసింది.
ఎయిర్ ఏషియాకు చెందిన ట్రైనింగ్ హెడ్‌ను కూడా మూడు నెలల పాటు ఆ పొజిషన్ నుంచి తొలగించారు. డీజీసీఏ ఏవియేషన్ రూల్స్ ఉల్లంఘించిన కేసులో అతనిపై కూడా వేటు వేశారు. ఈ ఘటనలో మొత్తం 8 మందిపై మూడు లక్షల చొప్పున ఫైన్ వేశారు.
రెగ్యులేటరీ నిబంధనలను విస్మరించినందుకు ఎందుకు చర్యలు తీసుకోరాదు అని డీజీసీఏ విమాన సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. లిఖితపూర్వక సమాధాన్ని పరిశీలించిన తర్వాత జరిమానా వేసినట్లు అధికారులు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

