కాంగ్రెస్ పార్టీ అత్యున్నత పదవికి… ఆనంద్ శర్మ రాజీనామా
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీ అత్యున్నత పదవులకు రాజీనామా చేస్తున్నారు. గులాం నబీ ఆజాద్ ఇటీవల జమ్ముకశ్మీర్‌లో కాంగ్రెస్ పార్టీ కీలక పదవి రాజీనామా చేశారు. మరో సీనియర్ నేత ఆనంద్ శర్మ కూడా తాజాగా అదే బాట పట్టారు. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ పదవికి ఆదివారం రాజీనామా చేశారు. పార్టీ సమావేశాల్లో తనను పట్టించుకోవడంలేదని, సమావేశాలకు తనను ఆహ్వానించడంలేదని ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో తన ఆత్మగౌరవం దెబ్బతిన్నదంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి లేఖ రాశారు. అయితే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల తరుఫున ప్రచారం చేస్తానని ఆయన తెలిపారు.
కాగా, కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభలో కాంగ్రెస్ ఉప నేత అయిన ఆనంద్ శర్మ ఈ ఏడాది ఏప్రిల్ 26న హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీకి ఛైర్మన్‌గా నియమితులయ్యారు. హిమాచల్ ప్రదేశ్‌లో అత్యున్నత కాంగ్రెస్ నేతల్లో ఆయన ఒకరు. అయితే పార్టీ సమావేశాలకు సంప్రదించకపోవడం, ఆహ్వానించకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల స్టీరింగ్ కమిటీ ఛైర్యన్ పదవికి ఆదివారం రాజీనామా చేశారు.
మరోవైపు ఈ ఏడాది చివర్లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. బీజేపీ నుంచి అధికారాన్ని చేజిక్కించుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. అయితే స్టీరింగ్ కమిటీ ఛైర్మన్ పదవికి ఆనంద్ శర్మ రాజీనామా చేయడం కాంగ్రెస్‌పై ప్రభావం చూపనున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Smit Machchhar: పైలట్ స్మిత్ మచ్చర్‌కు ఇజ్రాయెల్ ప్రెసిడెన్షియల్ అవార్డు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
KTR | భారత రాజ్యాంగం కంటే ఎవరూ ఎక్కువ కాదు.. జ్ఞానేష్ కుమార్ తక్షణమే వైదొలగాలి: కేటీఆర్
Thailand Queen: గ్రిపెన్ యుద్ధ విమానాన్ని నడిపిన థాయ్‌ల్యాండ్ క్వీన్… వీడియో
New Zealand: గాయపడ్డ ఇద్దరు కివీస్ క్రికెటర్లు.. భారత్‌తో సిరీస్‌కు దూరం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

