Delhi liquor policy case | ఈడీ చార్జిషీట్లో ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరు
Delhi liquor policy case | ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం రెండో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లో కొత్తగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పేరును కూడా చేర్చింది.
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) మంగళవారం రెండో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. ఈ చార్జిషీట్లో కొత్తగా ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా (Raghav Chadha) పేరును కూడా చేర్చింది. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా (Manish Sisodia) మాజీ సెక్రటరీ సీ అరవింద్ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా చద్దా పేరును చార్జిషీట్లో చేర్చినట్లు తెలిపింది.
ఢిల్లీలో 2021-22కు సంబంధించిన లిక్కర్ పాలసీపై గతంలో మనీశ్ సిసోడియా ఇంట్లో సమావేశం జరిగిందని, ఆ సమావేశానికి రాఘవ్ చద్దా కూడా హాజరయ్యారని ఈడీ దర్యాప్తులో సిసోడియా సెక్రెటరీ సీ అరవింద్ వెల్లడించాడు. వారితోపాటు పంజాబ్ ఎక్సైజ్ కమిషనర్ వరుణ్ రూజమ్, విజయ్ నాయర్, పంజాబ్ ఎక్సైజ్ డైరెక్టరేట్‌కు సంబంధించిన పలువురు అధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారని చెప్పాడు.
సీ అరవింద్ వాంగ్మూలం ఆధారంగా ఈడీ ఇప్పుడు ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా పేరును సప్లిమెంటరీ చార్జిషీట్లో చేర్చింది. గతంలో సీబీఐ కూడా ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసుకు సంబంధించి అక్కడి సీబీఐ కోర్టులో సప్లిమెంటరీ చార్జిషీట్ దాఖలు చేసింది. అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా పేరును ఆ సప్లిమెంటరీ చార్జిషీట్లో చేర్చింది. ఆ తర్వాత ఫిబ్రవరిలో ఆయనను అరెస్ట్ చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

