న్యూఢిల్లీ : బాలీవుడ్ సెలబ్రిటీలను అనుకరిస్తూ సోషల్ మీడియాలో జేమీ లీవర్ షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. బాలీవుడ్ పర్సనాలిటీలు వారి చిన్నారులను ఎలా నిద్రకు ఉపక్రమింపచేస్తారనేది అనుకరిస్తూ జేమీ రూపొందించిన ఈ వీడియోను ట్విట్టర్, ఇన్స్టాగ్రాంలో షేర్ చేశారు.
It’s #Bollywood nap time! pic.twitter.com/uP23gq9fYs
— Jamie Lever (@Its_JamieLever) January 25, 2023
ఈ వీడియోలో కరీనా కపూర్, సోనం కపూర్, ప్రియాంక చోప్రా జొనాస్, ఫరా ఖాన్లను జేమీ అనుకరించారు. ఆయా తారలు ఎలా మాట్లాడతారు, హావభావాలను జోడిస్తూ జేమీ వారిని అనుకరించిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. ఇట్స్, బాలీవుడ్ న్యాప్ టైమ్ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు.
ఈ వీడియోను ఆన్లైన్లో షేర్ చేసినప్పటి నుంచి 89,000కుపైగా వ్యూస్ రాగా పెద్దసంఖ్యలో రియాక్షన్స్ వచ్చాయి. ఈ వీడియోలో జేమీ బాలీవుడ్ సెలబ్రిటీలను పర్ఫెక్ట్గా అనుకరించారని ఓ యూజర్ రాసుకురాగా, మరికొందరు ఈ క్లిప్ చూడగానే తాము నవ్వు ఆపుకోలేకపోయామని కామెంట్ చేశారు. ఈ స్కిట్ ఫరా ఖాన్ ముఖంపై నవ్వులు పూయించిందంటే ఏ రేంజ్లో ఆకట్టుకుందో అర్ధం చేసుకోవచ్చు.