Indigo flight: ఇండిగో స్టాఫ్‌తో అనుచితంగా ప్రవర్తించిన స్వీడెన్ వ్యక్తి అరెస్టు
Indigo flight:ఇండిగో విమాన సిబ్బందిని స్వీడెన్ వ్యక్తి వేధించాడు. ఆ కేసులో అతన్ని ముంబైలో అరెస్టు చేశారు. మీల్స్ సర్వ్ చేసిన తర్వాత ఆ వ్యక్తి క్యాబిన్ సిబ్బందితో సరైన రీతిలో ప్రవర్తించలేదు.
న్యూఢిల్లీ: ఇండిగో విమాన(Indigo flight) సిబ్బందిని వేధించిన కేసులో స్వీడన్(Sweden)కు చెందిన 63 ఏళ్ల క్లాస్ ఎరిక్ హరాల్డ్ జోనాస్ వెస్ట్‌బర్గ్(Westberg)ను అరెస్టు చేశారు. బ్యాంకాక్ నుంచి వస్తున్న విమానంలో ఆ వ్యక్తి .. ఇండిగో మహిళా సిబ్బందితో అనుచితంగా ప్రవర్తించారు. దీంతో అతన్ని ముంబైలో అదుపులోకి తీసుకున్నారు. మీల్స్ సర్వ్ చేస్తున్న సమయంలో ఆ ప్రయాణికుడి ప్రవర్తన సరిగా లేదు. ఓ దశలో 24 ఏళ్ల ఆ మహిళ ఉద్యోగి ఫ్లయిట్ కెప్టెన్(flight captain)కు విషయాన్ని చేరవేసింది. ఆ తర్వాత వెస్ట్బెర్గ్కు రెడ్ వార్నింగ్ కూడా ఇచ్చారు.
క్యాబిన్ సిబ్బంది(cabin crew) తన ఫిర్యాదులో జరిగిన సంఘటన గురించి చెప్పింది. వెస్ట్‌బర్గ్ తాగి ఉన్నాడని, అతను సీఫుడ్ గురించి అడిగాడని, ఆయనకు చికెన్ మీల్స్(chicken meals) సర్వ్ చేసి, బిల్ కట్టేందుకు ఏటీఎం అడిగానని, అయితే కార్డును స్వైప్ చేసే సమయంల అతను తన చేయి పట్టుకున్నట్లు ఆ ఉద్యోగి తన ఫిర్యాదులో పేర్కొన్నది. పిన్ ఎంటర్ చేయమన్నప్పుడు అందరి ముందు హద్దులు దాటి తనతో దరుసుగా ప్రవర్తించినట్లు ఫిర్యాదులో తెలిపారు.
గడిచిన మూడు నెలల్లో అనుచితంగా ప్రవర్తించిన 8 మంది విమాన ప్రయాణికులను ఇండియాలో అరెస్టు చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
US Strikes: ట్రంప్ ఆదేశిస్తే.. 96 గంటల్లోనే అటాక్
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

