Shishir Khanal: గంటల్లోనే ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి.. 300 మంది భారతీయులు మిస్సింగ్: నేపాల్ విదేశాంగ మంత్రి
Shishir Khanal: గంటల వ్యవధిలోనే ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయినట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖానల్ తెలిపారు. ఎన్డీటీవీతో ఆయన మాట్లాడారు. గురువారం నాటి వరదల్లో 160 మంది మృతిచెందినట్లు ఆయన కన్ఫర్మ్ చేశారు. సుమారు 300 మంది భారతీయులు మిస్సింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు.
కాట్మాండు: గంటల వ్యవధిలోనే ఊళ్లకు ఊళ్లు కొట్టుకుపోయినట్లు నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖానల్(Shishir Khanal) తెలిపారు. ఎన్డీటీవీతో ఆయన మాట్లాడారు. గురువారం నాటి వరదల్లో 160 మంది మృతిచెందినట్లు ఆయన కన్ఫర్మ్ చేశారు. రసువా ప్రాంతంలో వేలాది మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదన్నారు. వేల సంఖ్యలో కుటుంబాలు ఇండ్లు కోల్పోయాయని, వారంతా గల్లంతు అయినట్లు ఆయన చెప్పారు. జల విలయం వల్ల జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేస్తున్నామని ఆయన తెలిపారు. మానస సరోవరం యాత్ర కోసం వచ్చిన భారతీయ పర్యాటకులు ఎక్కువగా మృతిచెందినట్లు ఆయన చెప్పారు. సుమారు 300 మంది భారతీయులు మిస్సింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. విదేశీ యాత్రికులతో పాటు భారతీయులు కూడా వరదలు సంభవించిన మార్గంలోనే మానస సరోవర యత్రకు వెళ్తుంటారని, సుమారు 300 మంది మిస్సింగ్ జాబితాలో ఉన్నారని, వారిని కాంటాక్టు అయ్యేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఖానల్ తెలిపారు. విదేశీ పర్యాటకుల క్షేమం కోసం అన్ని దేశాల ఎంబసీలతో టచ్‌లో ఉన్నట్లు నేపాల్ ప్రభుత్వం చెప్పింది. నేపాల్‌లో ఇటీవల సంభవించిన అత్యంత దారుణ విపత్తు అని ఆయన పేర్కొన్నారు. భారత్ అందించిన సాయం పట్ల ఆయన థ్యాంక్స్ తెలిపారు. రెస్క్యూ, రిలీఫ్పైనే తాము ఫోకస్ పెట్టామన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Danger bells | తెలంగాణలో తరుముకొస్తున్న కరువు..! చుక్క నీరు లేక నెర్రెలు వాసిన ప్రాజెక్టులు, చెయ్యిచ్చిన కాంగ్రెస్ : వీడియో
Cult | ‘కల్ట్’ రిలీజ్ ట్రైలర్.. రక్తపాతం, భయంకరమైన హత్యలతో విశ్వక్ సేన్ విశ్వరూపం!
ISRO | మరో కీలక ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో.. శుక్రవారం రాత్రి నింగిలోకి దూసుకెళ్లనున్న జీఎస్సెల్వీ-ఎఫ్18..!
Sri Venkateswara Creations | భారీ సాహసానికి పూనుకున్న శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.. ఒకేసారి నాలుగు క్రేజీ చిత్రాల డిస్ట్రిబ్యూషన్!
Jailer 2 | ‘జైలర్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయిందా .. నవంబర్ 12 నుంచే స్ట్రీమింగ్ అంటూ ప్రచారం!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

