Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలు ఇంటి నుంచి పారిపోయారు. ఒక బీచ్‌లో ఇద్దరు వ్యక్తులు వారికి పరిచయమయ్యారు. ఆ వ్యక్తులు ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేశారు. మరునాడు ఆ బాలికలపై అనుమానించిన ఒక మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది.
చెన్నై: ఇద్దరు బాలికలు ఇంటి నుంచి పారిపోయారు. ఒక బీచ్‌లో ఇద్దరు వ్యక్తులు వారికి పరిచయమయ్యారు. ఆ వ్యక్తులు ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేశారు. మరునాడు ఆ బాలికలపై అనుమానించిన ఒక మహిళ పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో మైనర్ బాలికలతో కలిసి హోటల్ రూమ్‌లో గడిపిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. (Men Check Into Hotel With Girls) తమిళనాడుకు చెందిన 15 ఏళ్ల వయస్సున్న ఇద్దరు మైనర్ బాలికలు చదువు విషయంలో తల్లిదండ్రుల ఒత్తిడి కారణంగా తమ ఇళ్ల నుంచి పారిపోయారు. నాగపట్టినం జిల్లా వేలన్కన్ని ప్రాంతానికి వారు చేరుకున్నారు. స్థానిక షాపుల్లో ఉద్యోగాల కోసం ఆ బాలికలు ప్రయత్నించి విఫలమయ్యారు. ఆ తర్వాత సముద్ర బీచ్‌లో ఈత కొడుతూ కొంత సమయం గడిపారు.
కాగా, కేరళకు చెందిన 23, 27 ఏళ్ల వయస్సున్న ఇద్దరు వ్యక్తులు పర్యటన కోసం ఆ బీచ్‌కు వచ్చారు. అక్కడ ఈ మైనర్ బాలికలతో వారికి పరిచయం ఏర్పడింది. ఆ రాత్రి బస చేయడానికి చోటు వెతకమని బాలికల్లో ఒకరు వారిని అడిగింది. ఈ నేపథ్యంలో ఆ యువకులు బాలికలతో కలిసి ఒక హోటల్లో బస చేశారు. ఒక్కో వ్యక్తి ఒక్కో బాలికతో హోటల్ రూమ్ షేర్ చేసుకున్నారు.
మరునాడు ఆ ఇద్దరు బాలికలు జాబ్ వెతుక్కొనేందుకు ఆ హోటల్ నుంచి బయటకు వెళ్లారు. వారిని చూసిన ఒక మహిళ, పోలీస్ అత్యవసర సహాయ నంబర్‌కు సమాచారం ఇచ్చింది. దీంతో మహిళా పోలీసుల ప్రత్యేక విభాగమైన ‘సింగప్పెన్ స్పెషల్ ఫోర్స్’ సిబ్బంది, బాలల సంక్షేమ కమిటీ అధికారులు స్పందించారు.
ఆ హోటల్ వద్దకు వారు చేరుకున్నారు. ఆ బాలికలతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వైద్యపరీక్షల కోసం వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మైనర్ బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన కేరళకు చెందిన ఇద్దరు వ్యక్తులను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. పోక్సో చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘నవంబర్ 29న మున్నూరు కాపు కార్తీకమాస వన సమారాధన’
‘కళాకారులు, కళను ప్రోత్సహించడం అందరి బాధ్యత’
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

