తెలంగాణ రాష్ట్ర గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్‌గా పల్లె రవికుమార్ బుధవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్‌లోని సంక్షేమ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
పల్లె రవికి జిల్లా నేతల శుభాకాంక్షలు
రాష్ట్ర గీత కార్మిక సహకార ఆర్థిక సంస్థ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకమైన పల్లె రవికుమార్ బుధవారం హైదరాబాద్‌లో మాసబ్ ట్యాంక్ సంక్షేమ భవన్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ట్రైకార్ చైర్మన్ రాంచందర్‌నాయక్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నారబోయిన రవిముదిరాజ్ ఉన్నారు.