దేవరకద్ర, నవంబర్ 23 : మండలంలోని నార్లోనికుంటలో శివాంజనేయస్వామి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం శివాంజనేయస్వామికి అభిషేకాలు, శివరామకోటి జపయజ్ఞం, గీతాయజ్ఞం, సామూహిక గీతావాహనం, అఖండ దీపారాధన కార్యక్రమా లు నిర్వహించారు. పలువురు భక్తులు స్వా మివారికి దాసంగాలను సమర్పించి మొక్కు లు చెల్లించుకున్నారు. అదేవిధంగా బస్వాపూర్‌లో పాతూర్ ఆంజనేయస్వామికి పల్లకీసేవ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.
శ్రీరామకొండలో ప్రత్యేక పూజలు
కోయిలకొండ, నవంబర్ 23 : మండలకేంద్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీరామకొండలో కార్తీక అమావాస్య సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. స్వయం భూ రామపాదం మూర్తులకు పంచామృత అభిషేకం, తులసీ అర్చన నిర్వహించి మొ క్కులు చెల్లించుకున్నారు. అలాగే మండలంలోని వీరభద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.