అలంపూర్ చౌరస్తా, జూలై 11: చిన్నారి ఆడుకుంటూ తన కాలి గొలుసు గజ్జ ముక్కులో ఇరికించుకున్న ఘటన ఉండవెల్లిలో చోటు చేసుకున్నది. మండల కేంద్రానికి చెందిన రెండేళ్ల చిన్నారి గీత శుక్రవారం రాత్రి ఇంట్లో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలుకున్న గజ్జ ముక్కులో ఇ రుక్కుపోయింది.
దీంతో శ్వాస తీసుకునేందుకు ఇబ్బంది పడగా.. గుర్తించిన తల్లిదండ్రులు వెంటనే అలంపూర్ చౌరస్తాలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. డాక్టర్ సందీప్, సి బ్బందితో క లిసి చాకచక్య ంగా ఎలాంటి శస్త్ర చికిత్స లే కుండా ము క్కులోంచి గ జ్జను బయట కు తీయడంతో తల్లిదండ్రులు ఊపిరిపీల్చుకున్నారు.