పల్లెలకు పట్టాభిషేకం
పల్లెలకు మంచి రోజులు రానున్నాయి. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పురస్కారాల ప్రోత్సాహం దక్కనున్నది. దీం తో అభివృద్ధి పనుల్లో పోటీ వాతావరణం నెలకొని మంచి ఫలితాలు రావాలన్నదే ఈ పురస్కారం ఉద్దే శం.
- 9 అంశాల ఆధారంగా జీపీలకు కేంద్ర పురస్కారాలు
- వచ్చే ఏప్రిల్‌లో అవార్డుల ప్రకటన
- మండలం నుంచి జాతీయ స్థాయిలో..
- రూ.లక్ష నుంచి రూ.5 కోట్ల ప్రోత్సాహం
- 90 శాతానికిపైగా వివరాలు నమోదు
- పర్యవేక్షిస్తున్న అదనపు కలెక్టర్లు
- 31 వరకు నమోదు ప్రక్రియ పూర్తి
- గ్రామాలకు మరిన్ని మంచి రోజులు
తెలంగాణ పల్లెలకు పట్టాభిషేకం జరగనున్నది. జీపీలను కేంద్ర పురస్కారాలు వరించనున్నాయి. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధిని మరింత ప్రోత్సహించేందుకు వీటిని ప్రకటించనున్నది. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు దక్కనున్నాయి. మెరుగైన జీవనోపాధి, ఆరోగ్యకరమైన పంచాయతీ, నీటి సమృద్ధి, పచ్చదనం-పరిశుభ్రత, స్వయం సమృద్ధి, సామాజిక భద్రత, మహిళా స్నేహపూర్వక పంచాయతీ, సుపరిపాలన, బాలల సంక్షేమం వంటి 9 అంశాల వారీగా అవార్డులకు పంచాయతీలను ఎంపిక చేయనున్నారు. వచ్చే ఏప్రిల్‌లో అవార్డులు అందించనున్నారు.రూ.లక్ష నుంచి రూ.5 కోట్ల వరకు ప్రోత్సాహం అందనున్నది. ఈ నెలాఖరుకు వివరాల నమోదు ప్రక్రియ పూర్తి కానున్నది. ఇప్పటికే 90 శాతానికిపైగా వివరాలను అధికారులు నమోదు చేశారు. ఆయా జిల్లాల అదనపు కలెక్టర్లు పర్యవేక్షిస్తుండగా.. గ్రామాలకు మరిన్ని మంచి రోజులు రానున్నాయి.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతితో నవాబ్‌పేట మండలంలోని చాలా గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. ప్రజల జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయి. గ్రామస్తులతో మమేకమై కార్యదర్శులు, సర్పంచులు పనులు చేపడుతున్నారు. అడిషనల్ కలెక్టర్లతోపాటు అన్ని శాఖల అధికారుల సహకారంతో నేషనల్ పంచాయతీ అవార్డు కోసం కృషి చేస్తున్నాం. జాతీయ అవార్డుల ఎంపిక కోసం పక్షం రోజులుగా పనులను వేగవంతం చేశాం. కార్యదర్శులు పూర్తిగా పనుల్లో నిమగ్నమయ్యారు. 54 పంచాయతీలకుగానూ ఇప్పటికే 40 గ్రామాల్లో ఆన్లైన్ ప్రక్రియ పూర్తయింది. నాలుగు కంప్యూటర్లతో రాత్రింబవళ్లు కష్టపడి 31 వరకు పూర్తి చేస్తాం. అనంతరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల అధికారులు ఆన్లైన్ దరఖాస్తుల క్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలించి అవార్డులకు ఎంపిక చేయనున్నారు.
– శ్రీలత, ఎంపీడీవో నవాబ్‌పేట
నాగర్‌కర్నూల్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ) పల్లెలకు మంచి రోజులు రానున్నాయి. గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు పురస్కారాల ప్రోత్సాహం దక్కనున్నది. దీం తో అభివృద్ధి పనుల్లో పోటీ వాతావరణం నెలకొని మంచి ఫలితాలు రావాలన్నదే ఈ పురస్కారం ఉద్దే శం. మండల, జిల్లా, రాష్ట్రస్థాయి నుంచి జాతీయస్థా యి వరకు ఈ పురస్కారాలు దక్కనున్నాయి. తొ మ్మిది అంశాల వారీగా అవార్డులకు గ్రామ పంచాయతీలను ఎంపిక చేయనున్నారు. ఇందులో మెరుగైన జీవనోపాధి, ఆరోగ్యకరమైన పంచాయతీ, నీటి సమృ ద్ధి, పచ్చదనం-పరిశుభ్రత, స్వయం సమృద్ధి, సామాజిక భద్రత, మహిళా స్నేహపూర్వక పంచాయతీ, సు పరిపాలన, బాలల సంక్షేమం అనే అంశాలు పొందుపర్చారు. గ్రామాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమ పథకాలు అ మలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రతి నెలా నిధులు విడుదల చేయడంతోపాటు పలు పథకాలను వేగవంతంగా అమలుచేస్తున్నది. దీంతో ఇంతకుముందు లేనట్లుగా గ్రామాలు ఇతర రాష్ర్టాలతో దీటుగా ముందుకు సాగుతున్నాయి.
పలు రంగాల్లో గ్రామాలు అభివృద్ధిలో ప్రత్యేకతను చాటుకుంటున్నాయి. ఈ క్రమంలో కేంద్రం ప్రకటించనున్న పురస్కారాలకుగానూ జిల్లా పంచాయతీ అధికారులు పురస్కారాల వివరాలను గ్రామాల వారీగా నమోదు చేస్తున్నారు. గతంలో అభివృద్ధి జరిగిందని భావించిన ఏవైనా కొన్ని గ్రామాల వివరాలను మాత్రమే పంపించడం జరుగుతుండేది. ఈసారి అందుకు భిన్నంగా ప్ర తి పంచాయతీలో తొమ్మిది అంశాల వారీగా వివరాల నమోదును ఆన్లైన్లో నివేదిస్తున్నారు. దీంతో ఆ యా గ్రామాల్లో అభివృద్ధి ఏ స్థాయిలో ఉందనేది కూ డా స్పష్టం కానున్నది. జిల్లా అధికార యంత్రాంగం పంచాయతీ అధికారులకు ఆదేశాలిచ్చింది. ముఖ్యం గా అదనపు కలెక్టర్లు ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తున్నారు. దాదాపు 90 శాతానికిపైగా వివరాల ఆన్లైన్ పూర్తయింది. కేంద్రం నిర్ధేశించిన మేరకు అక్టోబర్ 31వ తేదీ వరకు ఆన్లైన్ నమోదును పూర్తి చేయనున్నారు. దీని ప్రకారం మండలం, జిల్లా, రాష్ట్ర, జాతీ య స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయి. తొమ్మిది అంశాల వారీగా ఈ పురస్కారాలు ఉండడం గమనార్హం. ఇలా రూ.లక్ష నుంచి రూ.5 కోట్ల వరకు నగదు బహుమతులు ఇవ్వనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో పంచాయతీరాజ్ శాఖ దినోత్సవం సందర్భంగా పురస్కారాలు అందించనున్నారు. అవార్డులు పొందిన గ్రామ పంచాయతీలకు అదనంగా ఆర్థిక సహకారం అందనున్నది. దీంతో ఆయా గ్రామాలు అభివృద్ధిలో మరింత ముందుకు సాగే అవకాశం ఉన్నది.
పొందుపర్చిన తొమ్మిది అంశాలు..
- జీవనోపాధి : పంచాయతీల్లో ఉపాధి హామీ పథకం ద్వారా ఎంత మంది లబ్ధి పొందుతున్నారు. ఎన్ని జాబ్‌కార్డులు ఉన్నాయి. ఎంతమందికి వంద రోజులు పని కల్పించారు. గ్రామాల అభివృద్ధికి చేపట్టిన పనుల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయనున్నారు.
- ఆరోగ్యకర పంచాయతీలు : పీహెచ్‌సీల ద్వారా గ్రామాల్లో అందుతున్న వైద్య సేవలు, ఆరోగ్య విషయాలపై అవగాహన కార్యక్రమాలు, పారిశుధ్య నిర్వహణ, డంపింగ్ యార్డు వంటి తదితర అంశాలు ఉన్నాయి.
- నీటి సమృద్ధి : పల్లెల్లో ఇంటింటికీ శుద్ధ జలం అందుతున్నదా..? ఉపాధి హామీ ద్వారా చెరువులు, ఇతర నీటి వనరుల్లో పూడిక తీత చేపట్టారా..? వంటి అంశాలు ఉంటాయి.
- పచ్చదనం-పరిశుభ్రత : పచ్చదనం పెంపొందించేందుకు నాటుతున్న మొక్కలు, వాటి సంరక్షణ, తడి, పొడి చెత్త నిర్వహణ.
- స్వయం సమృద్ధి : గ్రామాల్లో స్వయం సహాయక సంఘాలకు రుణాలు ఎంత మంజూరు చేశారు? రుణాలు పొందిన మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు తీసుకున్న చర్యలు ఏంటి? వంటివి ఉన్నాయి.
- సామాజిక భద్రత : అర్హులైన పేదలకు రేషన్ కార్డుల మంజూరు, ఆసరా పింఛన్ల పంపిణీ వివరాలు.
- మహిళా స్నేహ పూర్వకం : ఏడాదికోసారి మహిళా సంఘాల సమావేశాలు నిర్వహించడం, మహిళల సమస్యల పరిష్కారానికి తీసుకునే చర్యలు, స్వయం సహాయక సంఘాలకు అందించే రుణాలు, ఉపాధి అవకాశాల్లో జరుగుతున్న న్యాయం వంటి అంశాలు.
- సుపరిపాలన : పంచాయతీల్లో గ్రామ సభలు, సర్వసభ్య సమావేశాల నిర్వహణ, పాలనకు తీసుకుంటున్న విధానాలు.
- బాలల సంక్షేమం : బాలల హక్కుల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? బడీడు పిల్లలు బడిలోనే ఉన్నారా? లేదా అనే వివరాలు నమోదు చేస్తారు.
అటవీ భూములను ఆక్రమిస్తే చర్యలు
కొల్లాపూర్, అక్టోబర్ 29 : మండలంలోని సోమశిల అర్బన్ పార్కును ఎఫ్డీపీటీ క్షితిజా, అచ్చంపేట ఎఫ్‌డీవో నవీన్‌రెడ్డి శనివారం సందర్శించారు. మండలంలోని ఎర్రకుంటలో సోలార్బోర్ ఏర్పాటుకుగానూ స్థలాన్ని పరిశీలించారు. అగ్రహా రం నర్సరీ, సోమశిల నదిపరీవాహక ప్రాంతాలను పరిశీలించారు. అటవీ రక్షణకు, అగ్నిప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలని కొల్లాపూర్ రేంజ్ పరిధిలోని సిబ్బందికి సూచించారు. అటవీ భూములను ఆక్రమిస్తే చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ పద్మారావు ఉన్నారు.
31 వరకు నమోదు పూర్తి..
ఉత్తమ గ్రామ పంచాయతీల అవార్డుల కో సం జిల్లాలోని 461 గ్రా మ పంచాయతీల వివరాలను ఈ నెల 31 వ రకు ఆన్లైన్లో వివరా లు నమోదు చేయడం పూర్తవుతుంది. 9 అం శాల్లో జరిగిన అభివృద్ధి ప్రకారం మండలం నుంచి జాతీయ స్థాయి వరకు విభాగాల వారీగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు ఉంటాయి. ఎంపీడీవోలు పకడ్బందీగా వివరాలను నమోదు చేయాలి. త్వరలో కేంద్ర బృందం గ్రామాలను సందర్శించి నమోదుచేసిన వివరాల ప్రకారం పరిశీలన చేపడుతుంది. తప్పులు దొర్లకుండా ఆన్లైన్లో వివరాలు నివేదించాలి.
– మనూచౌదరి, అదనపు కలెక్టర్, నాగర్‌కర్నూల్
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్‌ను.. సిక్కిం గవర్నర్‌గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

