కాలప్రవాహం వెలువరించే నిజనిర్ధారణలు
స్మృతిపథంలో నిగ్గుదేలిన కఠోర సత్యాలు
ప్రమాణబద్ద చింతనల ఆలోచనాతరంగాలు
వైరుధ్యాలకతీతమైన పురోగమన భావనలు
దశాబ్దాల అరాచక రాజ్యాధికార పాక్షికత
పాతరేసిన అస్తిత్వ పునాదుల వైభవం
బలమైన ప్రాంతీయ అస్తిత్వాలే భారతావని బలాలు
భౌగోళిక హద్దుల్ని కాలరాసే, సామ్రాజ్యవాదుల
సమస్త వనరుల్ని కబళించే దుష్టపన్నాగం
ప్రపంచమంతా నిస్సహాయంగా నిశ్చేష్టమైన దారుణం
మేల్కొన్న సజాతివిచక్షణ నో చెప్పినవారు మాత్రం అంటూ
తన పాత్ర కూడా విషయం నిరసించి నిర్మూలించలేదా?
ఏడు దశాబ్దాల పాలనలో
పారిన ప్రాంతీయ దురభిమానం
కనుమరుగై సాధించిన వైభవోపేత అస్తిత్వ ఉనికి
ప్రాంత విభజన ప్రామాణిక యధార్థ దృశ్యకావ్యం
అధికార దాహం తలకెక్కిన వితండ వాదనాస్వరం
విషపూరిత నాగు పాడే కపట మాయోపాయం
అభ్యుదయ భారతమే పరమోన్నతమైతే…
అధికారాదు ప్రాంతీయ అస్తిత్వ నాశనం
సంస్కర్తల మానవీయ విగ్రహావిష్కరణలు కావాలి
మానవ ప్రగతి ఉత్ప్రేరక స్ఫూర్తి దీపాలు
పారిన రక్తపుటేరుల
నరహంతక విగ్రహాల దుశ్చింతనలు
తరాలు మారినా తొలగని
దుష్టగ్రహాల కపటవ్యూహాలు
సార్వజనీన సమాదరణ
విగ్రహావిష్కరణల ఆదర్శాలు
కారాదవి కౌటిల్యతకు ప్రతిరూపాలై
వేధించే కంటక దృశ్యాలు
అవి కావాలి మానవ వికాసం
ప్రభోదించే మార్గదర్శకాలు
-కె. లక్ష్మణ్ గౌడ్
9704930509