గతపు బాధలింక కడలిలో…
గతపు బాధలింక కడలిలో కలుపుచు వర్తమానమందు పరుగులిడుచు పడియు లేచు కెరట వడిని వొడిసిపట్టి భవితతీర్చి దిద్దు భరతవీర
గతపు బాధలింక కడలిలో కలుపుచు
వర్తమానమందు పరుగులిడుచు
పడియు లేచు కెరట వడిని వొడిసిపట్టి
భవితతీర్చి దిద్దు భరతవీర!
వ్యసనముల వీడి వ్యవసాయమునుజేసి
కలిసి మెలిసి బ్రతుక కలిమికలుగు
స్వార్థమెంతో చెడుగు సహవాసము జెరచు
చీడ పురుగు చెట్ల జెరచినట్టు.
పేదవారు కలిసి ప్రీతిగా బ్రతికిన
వేరుపరచజూచు పెద్దవారు
చిన్న లాభమునకె చిందులేయుటమాని
బ్రతుకు బాగు పడెడు బాట నడువు.
మంచివాడని యొకనినె యెంచి నమ్మి
వంచనకు లోనగుట నేడు గాంచుమయ్య
వ్యక్తి యారాధనెంతో యనర్థమిడును
మూఢభక్తివలెనె ముంచగలదు.
అడుగకుండగనె ధనమునాశజూపి
నీదుసాయమున పదవికెక్కు వాడు
నొప్పితెలియకుండనెనిన్ను పీల్చగలడు
జలగరీతిగ నిజమిదె తెలుసుకొనుము.
-చిలకమర్రి కృష్ణమాచార్యులు
99855 13883
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

