అరవై ఏండ్ల కాపురంల అరిగోసపడి
ఇడుపు కాయితం తీసుకుంటే
ఇంట్ల తొంగిచూసుకుంట
ఇంకా ఇసుగిస్తుండు
వాని బాధ వానికి వాజిబే
పిల్ల ఇంకా కొత్త పెళ్ళికూతురోలె
ఉండె మరి
వాడేమో పన్నెండు ఏండ్లయినా
ఇల్లు సక్కదిద్దుకోకపాయే
కులాల కుళ్ళు కంపు పోకపాయె
విడాకులు వానికి
విలువలేని ఎండుటాకులేమో
పెద్దలతోని పరపర
తొక్కేయ చూస్తుండు
ఇడుపు కాయితం మాకు
ఇల్లు ఒళ్ళు కాల్చుకుంటే
దక్కిన సత్కారం
ఇజ్జత్కి దొరికిన సాతంత్రం
ఇడ్చేది లే…కలిసేది లే
-సుధీంద్ర భార్గవ
9949120680