దూరపు కొండలు
వెచ్చని పచ్చని చీర కట్టుకొని కన్నుల్లో కైపుల్ని నింపుకొని కవ్విస్తు ఉంటాయి అటేపు కొండలు ఎంత ముద్దుగా బొద్దుగా ఉంటాయో పొద్దు పొద్దున్నే సూత్తూనే ఉంటానా ఇంతలోనే పొద్దువాలిపోద్ది.
వెచ్చని పచ్చని చీర కట్టుకొని
కన్నుల్లో కైపుల్ని నింపుకొని
కవ్విస్తు ఉంటాయి అటేపు కొండలు
ఎంత ముద్దుగా బొద్దుగా ఉంటాయో
పొద్దు పొద్దున్నే సూత్తూనే ఉంటానా
ఇంతలోనే పొద్దువాలిపోద్ది
మురిసి మైమరుస్తూ బ్రతుకంతా
ఎదురుచూపుల ప్రేమపక్షవుద్ది
ఎక్కితేగానీ ఎత్తులు
దిగితేగానీ లోతులు తెల్వదాయే
కాలం కాళ్లను కట్టేసినట్టు
నేనటు పోయేట్టులేదు
దారులన్నీ మూసుకుపోయినట్టు
ఎప్పుడూ ఏవో తెలవని ముళ్లకంచెలు
కోరికలకు రెక్కల్ని తొడిగి
గిజిగాడిలా శ్రమించినా
దిగులుగూడు మారదాయే
దూరమెపుడూ చిక్కగా చక్కగా నునుపుగా
కళ్ల బడుతూనే ఉంటది కదా..
మిన్ను విరిగి మీద పడ్డట్టు
ఎదలో ఎప్పుడూ ఏదో మోయలేని బాధ
అశ్రువులను ఒలికిన కళ్లు
తేలికవ్వాలి..తేటతెల్లం కావాలి
బరువు తగ్గకుంటే..
ఇంకాస్త బోరుమని ఏడ్వు
పొరలు పొరలుగా తొలగిన మసకలు
దృశ్యాలను ప్రస్ఫుటం చేస్తుంటయి
దూరపు కొండల్ని ఒక్కపాలి
తనువును నిలువెల్లా విరుచుకుని చూడు
భ్రమలన్నీ శిథిలమైన మట్టిగోడల్లా
పెళపెళా రాలిపోతాయి
చూపులు నగ్నపునీతమవ్వటానికి
రెప్పపాటు కాలం చాలదూ
నువ్విప్పుడు నిలబడ్డ చోటే
నీడల ఊడల చెట్టయితది
ప్రశాంతంగా సేదతీరుతావు
సత్యం బోధ పడింది కదా..
కొండనాలుక కూడా కోయిలై కూస్తాంటది
ఇక దూరపుకొండల్ని నువ్వెప్పటికీ ఎక్కవు
కోర్కెల దీపం కొండెక్కుతుంది!
-డా.కటుకోఝ్వల రమేష్
9949083327
Read Today's Latest Literature-more News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Auto Draft
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

