పువ్వుతో మొక్క పదిలం
అపార్టుమెంట్ల పుణ్యమా అని మొక్కలన్నీ నేల మీద నుంచి కుండీల్లోకి వచ్చి చేరాయి. అవి బతికేందుకు నీరు కావాలంటే మనం పోస్తే తప్ప మరో అవకాశం లేదు. నాలుగు రోజులు పనులు ఎక్కువ ఉండి కుదరకపోయినా, ఏ ఊరికో వెళ్లినా వాటి పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుంది.
అపార్టుమెంట్ల పుణ్యమా అని మొక్కలన్నీ నేల మీద నుంచి కుండీల్లోకి వచ్చి చేరాయి. అవి బతికేందుకు నీరు కావాలంటే మనం పోస్తే తప్ప మరో అవకాశం లేదు. నాలుగు రోజులు పనులు ఎక్కువ ఉండి కుదరకపోయినా, ఏ ఊరికో వెళ్లినా వాటి పరిస్థితి ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకే సెల్ఫ్ వాటరింగ్ ప్లాంటర్లు మార్కెట్లోకి వస్తున్నాయి. అంటే ప్రత్యేక అమరిక ద్వారా మొక్క అవసరాన్ని బట్టి కుండీలోని నీళ్లే కొద్ది కొద్దిగా మొక్కకు అందుతాయి. మరి అంతకు ముందే చక్కని కుండీల్లో ఉండే మొక్కల సంగతేంటి?!

అన్ని కుండీలూ ఇలా మార్చగలమా… అనే సమస్యకు పరిష్కారంగా మార్కెట్లో దొరుకుతున్నవే ‘తులిప్ షేప్డ్ సెల్ఫ్ వాటరింగ్ స్పైక్స్’. ఇవి తులిప్ పూల ఆకృతిలో ఉంటాయి. వీటి అడుగున సన్నటి పొడవాటి గొట్టంలాంటి అమరిక ఉంటుంది. ఈ పువ్వులో నీళ్లు పోసి మొక్క ఉన్న కుండీలో గుచ్చితే, మట్టిలో ఉన్న తేమ ఆధారంగా మెల్లిమెల్లిగా నీళ్లు నేరుగా మొక్కల వేర్లకు అందుతూ ఉంటాయి. మనం వీటిని ఏ కోణంలో అమర్చాం అన్నదాన్ని బట్టి నీళ్లు అందే వేగం మారుతూ ఉంటుంది. చూసేందుకు కూడా అందంగా, కుండీని అలంకరించినట్టుగా కనిపిస్తాయివి. ఇక, ఈ పువ్వులుంటే మొక్క పదిలమే మరి!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

