Health Tips | నెలసరి అవసరాల కోసం.. ఆ ప్యాంటీలు వాడొచ్చా?
ఇంతకు ముందు పాత బట్టలు వాడారంటే, వాటిని మాటిమాటికి మార్చేవారు కాదు. రోజంతా ఒకటే ఉండేది. దాంతో స్రావాలు ఎండిపోయి, ఇన్ఫెక్షన్లకు కారణమయ్యేవి.
నెలసరి అవసరాల కోసం రీయూజబుల్ ప్యాడ్లు, పీరియడ్ ప్యాంటీల లాంటివి ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. వీటిని ఉతికి మళ్లీమళ్లీ వాడటంఆరోగ్యానికి మంచిదేనా?
- ఓ పాఠకురాలు
ఇంతకు ముందు పాత బట్టలు వాడారంటే, వాటిని మాటిమాటికి మార్చేవారు కాదు. రోజంతా ఒకటే ఉండేది. దాంతో స్రావాలు ఎండిపోయి, ఇన్ఫెక్షన్లకు కారణమయ్యేవి. నేటి రీయూజబుల్ ప్యాడ్స్, ప్యాంటీలను సైతం మామూలు ప్యాడ్ల మాదిరి ఏడెనిమిది గంటల్లోపు మార్చాల్సిందే. వీటిని కొనేప్పుడు ఎంత మెత్తగా ఉన్నాయి అన్నదీ చూసుకోవాలి. మృదువైన వస్ర్తాన్నే ఎంచుకోవాలి. ఉతికేప్పుడు డిటర్జెంట్
పేరుకుపోకుండా చూసుకోవాలి. శుభ్రంగా వదిలి పోయేలా జాడించాలి. ఎండలో ఆరేయాలి. ఇలా, గాలికి ఎండలో ఆరేసే వెసులుబాటు ఉన్నప్పుడే పునర్వినియోగించగలిగే ప్యాంటీలు, ప్యాడ్లు వాడటం మంచిది. అలాగే ఎన్నిసార్లు తిరిగి వినియోగించవచ్చు అనేది కూడా చూసుకుని వాడాలి. గతంలో వాడిన వస్ర్తాలకు ఇవేం భిన్నం కాదు. కానీ జాగ్రత్త తీసుకుంటే వాటినైనా ఇలాగే వినియోగించవచ్చు.
– డాక్టర్ పి. బాలాంబ సీనియర్ గైనకాలజిస్ట్
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

