ఏసీ ప్లాంట్స్
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. పర్యావరణంలో వచ్చే మార్పులు కూడా అధిక వేడికి కారణం అవుతున్నాయి. వేసవి వేడిని తట్టుకోవడానికి కూలర్లు, ఏసీలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ, ఏసీ ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదనేది నిపుణుల సూచన.
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయి. పర్యావరణంలో వచ్చే మార్పులు కూడా అధిక వేడికి కారణం అవుతున్నాయి. వేసవి వేడిని తట్టుకోవడానికి కూలర్లు, ఏసీలను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కానీ, ఏసీ ఎక్కువగా వాడటం ఆరోగ్యానికి మంచిది కాదనేది నిపుణుల సూచన. అయితే, వేసవి తాపాన్ని తగ్గించుకునేందుకు ఇంట్లోనే చిన్న చిన్న మొక్కలను పెంచుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. కొన్నిరకాల మొక్కలను ఇంట్లో పెంచుకోవడం వల్ల వాతావరణం ఆహ్లాదంగానే కాకుండా చల్లగా కూడా ఉంటుంది.
బేబీ రబ్బర్
ఇంట్లో పెంచుకునే అందమైన మొక్కల్లో బేబీ రబ్బర్ కూడా ఒకటి. ఈ మొక్క చిన్నగా ఉంటుంది. దీనిని ఇంట్లో ఎక్కడైనా సులభంగా పెంచుకోవచ్చు. దీనికి ప్రతిరోజూ నీరు పోయాల్సిన అవసరం కూడా లేదు. ఇది వాతావరణాన్ని చల్లగా మార్చగలదు కూడా. ముఖ్యంగా వేసవిలో ఇళ్లలో ఈ మొక్కను పెంచడానికి చాలామంది ఇష్టపడతారు.
ఫైకస్
ఇంట్లో పెంచుకోవడానికి అనువైన మొక్కలలో ఇదీ ఒకటి. దీన్ని ఒక చిన్నపాటి కుండీ లేదా తొట్టెలో పెంచుకోవచ్చు. ఈ మొక్క గాలిని శుద్ధి చేస్తుంది. అంతేకాదు, వేడిని తగ్గించడంలో కూడా సాయపడుతుంది.
మనీ ప్లాంట్
మనీ ప్లాంట్ గురించి తెలియని వాళ్లు ఉండరు. వాస్తు శాస్త్రం ప్రకారం ఈ మొక్కను ఇంట్లో పెంచుకుంటే మంచిది అని చాలామంది చెబుతుంటారు. ఈ మొక్క ఇంటికి అందాన్ని మాత్రమే కాదు గాలిలో స్వచ్ఛతను కూడా పెంచుతుంది.
ఫెర్న్
వేసవిలో ఇంటిని చల్లగా ఉంచగల మొక్క ఇది. నిండా ఆకులతో కనువిందు చేసే ఫెర్న్ గాలిలో తేమను నిలిపే గుణం కలిగి ఉంటుంది.
కలబంద
వేసవి కాలంలో ఇంట్లో కలబంద మొక్కల పెంపకం ప్రయోజనకరంగా ఉంటుంది. కేశ సంరక్షణకు, చర్మ సౌందర్యానికి ఉపయోగపడే కలబంద గది ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించడంలోనూ గుణం చూపిస్తుంది. ఫలితంగా ఇంట్లో వాతావరణం చల్లగా ఉంటుంది.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

