కొత్త.. అనే మాటలోనే ఎక్కడలేని కొత్తదనం! కొత్త పంచాంగం, కొత్త బెల్లం, కొత్త మామిడి పిందెలు, కొత్త వేపపూత. ఎన్ని కొత్తలో! ప్రకృతి సైతం కొత్తగా ముస్తాబవుతుంది. పోటీలకు సిద్ధం అవుతున్న కొత్త గాయనిలా కోకిల మత్తుగా గొంతు సర్దుకుని రాగాలు తీస్తుంది. ఇక పట్టుచీరల సందడి చెప్పేదేముంది? పసుపు, గులాబీ, బంగారు వన్నెల మిశ్రమంతో డిజైన్ చేసిన ఈ హాఫ్ శారీ ైస్టెల్.. కంచిపట్టు చీర చూడండి. పీకాక్ ప్యాటర్న్ ఎంబ్రాయిడరీ బ్లౌజ్ చీరకు మరింత అందం తీసుకొచ్చింది.