మస్లిన్ పాస్టల్ బ్లూ చీర ఇది. అద్భుతమైన జరీ పనితనంతో అంచులకు కొత్త మెరుపు వచ్చింది. సంప్రదాయ శోభ కూడా తోడైంది. ముస్తాబై మురిసిపోవడానికి వచ్చే శ్రావణం దాకా ఎదురుచూడాల్సిన పన్లేదు. భాద్రపదంలోనూ కట్టుకోవచ్చు. దుర్గా నవరాత్రులకు తిరుగులేని ఎంపిక.
చాలా తేలిగ్గా ఉంటాయి కాబట్టి, ఎంతసేపు చీరకట్టులో ఉన్నా చికాకు అనిపించదు. ఇదే రంగు సాటిన్ ఆర్గంజా డిజైనర్ బ్లౌజ్.. ట్రెండీలుక్ తెచ్చింది.