Beauty Tips | మేకప్కు వేల ఖర్చు వద్దు.. ఈ చిట్కాలతో మెరుగైన మేనిఛాయ మీ సొంతం
Beauty Tips | అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ఇక, అతివలైతే చెప్పేదే లేదు. తమ సౌందర్యాన్ని ఇనుమడింపజేయడం కోసం వాళ్లు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. కొందరైతే మేకప్ కోసం వేలల్లో వెచ్చిస్తుంటారు.
Beauty Tips | అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. ఇక, అతివలైతే చెప్పేదే లేదు. తమ సౌందర్యాన్ని ఇనుమడింపజేయడం కోసం వాళ్లు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. కొందరైతే మేకప్ కోసం వేలల్లో వెచ్చిస్తుంటారు. కానీ, చిన్నచిన్న చిట్కాలతో మెరుగైన మేనిఛాయ సొంతమవుతుందని చెబుతున్నారు నిపుణులు. అవే ఇవి..
క్లెన్సింగ్
పడుకునే ముందు ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. రోజంతా పేరుకుపోయిన మేకప్, దుమ్ము, కాలుష్యాన్ని తొలగించుకోవాలి. లేదంటే చర్మం చికాకు పెడుతుంది. పెరుగులో తేనె కలిపి ముఖానికి అప్లయ్ చేయాలి. పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకుంటే సరి.
మాయిశ్చరైజర్

Moisturizing
చర్మానికి సరిపడా మాయిశ్చరైజింగ్ క్రీమ్ రాయాలి. హైడ్రేటింగ్ నైట్ క్రీమ్ వాడితే మంచిది. మాయిశ్చరైజర్ రాయడం వల్ల తేమ చర్మానికి పట్టి ఉంటుంది. మేనికి కొత్త నిగారింపు ఇవ్వడంలో సాయపడుతుంది.
కళ్ల రక్షణ

Eyeliner
నిద్రపోయే ముందు తప్పనిసరిగా కళ్లలో పెట్టుకున్న లెన్స్ తొలగించాలి. అలాగే మస్కారా, ఐలైనర్తో పాటు కంటి చుట్టూ వేసుకున్న అలంకరణ మొత్తం తీసేయాలి. కళ్ల చుట్టూ ఉన్న సున్నితమైన చర్మం దెబ్బతినకుండా ఉండేందుకు ఐ మేకప్ రిమూవర్ఉపయోగించొచ్చు.
సీరమ్

Serum
రెగ్యులర్గా సీరమ్, రెటినాయిడ్స్, విటమిన్ సి ఉత్పత్తులు ఉపయోగించడం మంచిది. ఇవి ముడతలు, నల్లమచ్చలు, మొటిమలు నివారించడంతోపాటు చర్మ సమస్యల్ని పరిష్కరించగలవు. సీరమ్ ఉపయోగించే ముందు చర్మ వ్యాధి నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
మంచి నిద్ర

Sleep
అందం కోసం ఏవేవో చేస్తారు కానీ, కంటి నిండా నిద్ర అన్నిటి కంటే ముఖ్యం. నాణ్యమైన నిద్ర చర్మం పునరుత్పత్తి ప్రక్రియలో కీలకపాత్ర పోషిస్తుంది. శరీరం, చర్మం ఆకర్షణగా అందంగా ఉండాలంటే ప్రతిరోజూ కనీసం 8 గంటల నిద్ర అవసరం. రాత్రివేళల్లో స్మార్ట్ఫోన్లను దూరం పెట్టడం మర్చిపోవద్దు.
తగినన్ని నీళ్లు..

Water Drinking
వేసవిలో శరీరంలో నీళ్ల శాతం తగ్గకుండా చూసుకోవడం చాలా అవసరం. నీళ్లు సమృద్ధిగా తీసుకున్నప్పుడు చర్మం నిగనిగలాడుతుంది. ఆల్కహాల్, కెఫీన్ వినియోగాన్ని వీలైనంత వరకు నివారించాలి. ఇవి చర్మాన్ని డీహైడ్రేట్ చేస్తాయి. వాటిని తగ్గించి.. పండ్లరసాలు, మజ్జిగ తీసుకోవాలి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

