మనసు దోచే పరిమళం
మనసు దోచే పరిమళం వెదజల్లితే రెండు హృదయాల నడుమ ప్రేమ చిగురించినట్టే! మంచి గంధం సోకగానే వలపుల హరిచందనాలు ఎదలో కదలాడుతాయి.
మనసు దోచే పరిమళం వెదజల్లితే రెండు హృదయాల నడుమ ప్రేమ చిగురించినట్టే! మంచి గంధం సోకగానే వలపుల హరిచందనాలు ఎదలో కదలాడుతాయి. అలాంటి కమ్మనైన తావి ఒంటి నుంచి వచ్చిందంటే ఎంతటివారైనా ఫిదా అయిపోవాల్సిందే! మగువలకు నచ్చే.. వారి మనసు దోచే పరిమళాలు విరజిమ్మే ఐదురకాల పర్ఫ్యూమ్స్ మీ కోసం..
కాల్విన్ క్లెయిన్ వన్
ప్రపంచంలో అత్యంత డిమాండ్ ఉన్న ఫ్రాగ్రెన్స్ ఇది. ఈ సెంట్ ఒకసారి ఒంటికి రాసుకుంటే చాలు.. ఆ సువాసనకు మనసంతా రిఫ్రెష్ అవుతుంది. నారింజ, ఇలాచీ, బెర్రీ పండు ఫ్లేవర్లలో కూడా ఈ సెంట్ మార్కెట్లో అందుబాటులో ఉంది. మీరు రెగ్యులర్‌గా వాడే ఫ్లేవర్లే కావాలనుకుంటే.. మల్లె, దేవదారు, అంబర్ చెట్ల గంధంతో తీసిన అత్తరులు కూడా దొరుకుతాయి.
గుడ్‌గర్ల్ పెర్ఫ్యూమ్
ఈ సెంటు సీసా చూడటానికి ఎంత ఫ్యాన్సీగా ఉంటుందో.. దీని సువాసన అంతకంటే మత్తుగా ఉంటుంది. మల్లె, బాదం, కాఫీ, కోకోవా, టోంకా అనే ఫ్రాగ్రెన్స్ అన్నీ కలిపి తయారుచేస్తారు. ఈ సెంట్ తియ్యతియ్యటి సువాసనలు వెదజల్లుతుంది. కోకోవాలోని సుమధురాలు.. మల్లెపూల మధురిమల్లో కలిసి మీ ఒంటిపైనుంచి అలా గాలిలో కలుస్తుంటే.. ఎంతటివారైనా ఆ సెంట్ వాసనకు మైమరిచిపోవాల్సిందే.
వెనీలా ప్లానిఫోలియా
ఐస్‌క్రీమ్ అంటే ఇష్టమున్న వారికి వెనీలా ఫ్లేవర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సెంట్ స్పెషాలిటీ కూడా అదే. వెనీలా ఫ్లేవర్‌లో దొరుకుతుంది. పూర్తిగా పూల నుంచి సేకరించిన ఫ్రాగ్రెన్స్ ఈ సెంటుల్లో ఉంటాయి. ఈ సెంట్ పరిమళాలు ఒక్కసారి వాసన చూస్తే అస్సలు వదలరు.

ఫ్లవర్ బాంబ్
పేరుకు తగ్గట్టే ఇది పూలతో చేసిన బాంబులాంటి సెంట్. రకరకాల పూలతో డిజైన్ చేసిన అందమైన బొకే ఎలా ఉంటుందో.. ఈ సెంట్ వాసన కూడా అలాగే ఉంటుంది. అమెరికాలోని అటవీ ప్రాంతాల్లో మాత్రమే దొరికే సాటెల్యాస్ అనే పూలు, బొండుమల్లెలు, హెర్బల్ గుణాలు కల ఫ్రెసియా జాతికి చెందిన పూలు, గులాబీ రేకుల కలయికతో చేసిన సెంట్ ఇది. ఒక్కసారి ఈ సెంట్ పూసుకుంటే.. పూలతోటలో విహరించిన ఫీలింగ్ వస్తుంది.
మైసన్ ఫ్రాన్సిస్ కుర్కిజియాన్
కుంకుమపువ్వు, మల్లె, గంధం సువాసనలు కలగలిసిన సెంట్ ఇది. పూవుల గాలి మీ శరీరాన్ని తాకుతున్నట్టుగా దీని సువాసనలు మిమ్మల్ని వదిలి వెళ్లవు. ఒంటిని అతుక్కుపోయే ఈ సెంట్‌ను రకరకాల గంధపు చెక్కలు, మల్లెజాతికి చెందిన పువ్వుల రసం నుంచి తయారుచేస్తారు.

Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
MBA student dies | పరీక్షకు ముందు యూనివర్సిటీ భవనం పైనుంచి దూకి.. ఎంబీఏ విద్యార్థిని మృతి
ఉద్యోగుల సుదీర్థ సేవలు సంస్థకు చిరస్మరణీయం : ఎస్ ఓ టు జీఎం ఎం.గోవిందరావు
DK Aruna | భూములు అమ్మి రాష్ట్రాన్ని నడుపుతారా.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

