Collector Koya Sriharsha | యూరియా వాడకం తగ్గించేందుకు రైతులకు అవగాహన కల్పించాలి : కలెక్టర్ కోయ శ్రీహర్ష
Collector Koya Sriharsha | రైతులు అధిక మోతాదులో యూరియా వాడడం వల్ల భూసారం కోల్పోతుందని దానిని తగ్గించేలా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.
పెద్దపల్లి రూరల్ : రైతులు అధిక మోతాదులో యూరియా(Urea) వాడడం వల్ల భూసారం కోల్పోతుందని, దానిని తగ్గించేలా సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు ( Officials ) రైతులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ( Collector Koya Sriharsa) సూచించారు.
పెద్దపల్లి మండలం బ్రాహ్మణపల్లి రైతు వేదికలో దుకాణాల డీలర్లు, వ్యవసాయ శాఖ అధికారులతో శనివారం అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు ఎకరానికి ఎంత మోతాదులో యూరియాను వాడాలో అంతే సరఫరా జరిగేలా చర్యలు తీసుకోబోతున్నామని అందుకు ప్రతి ఒక్కరు సహకరించాలన్నారు.
పరిమితికి మించి యూరియా వాడడం వల్ల కలిగే అనర్థాలపై రైతులకు వివరించాలని సూచించారు. యూరియా అమ్మకాలలో తేడాలు, బ్లాక్ చేసే విధానాలకు స్వస్తి పలికేందుకే త్వరలో ఒక యాప్ ను తయారు చేస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి భక్తి శ్రీనివాస్ , జిల్లాలోని వివిదమండలాలకు చెందిన వ్యవసాయ శాఖ అధికారులు, డీలర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. మేజిస్ట్రేట్ ముందు సీజేపీ నేతలు హాజరు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

