Robert Card: 22 మందిని చంపిన రాబర్ట్ కార్డ్ ఎవరు? అతని బ్యాక్‌గ్రౌండ్ ఏంటి ?
Robert Card: మిలిటరీలో పనిచేశాడతను. ఫైర్ఆర్మ్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేశాడు. ఓ సారి గృహ హింస కేసులో అరెస్టు అయ్యాడు. ఇటీవలే రెండు వారాల పాటు మానసిక వ్యాధికి చికిత్స తీసుకున్నాడు. కానీ ఇంతలోనే రాబర్ట్ కార్డ్ ఘాతుకానికి పాల్పడ్డాడు. 22 మందిని విచక్షణారహితంగా కాల్చి చంపాడు.
లివిస్టన్: అమెరికాలో కాల్పులు జరిపి 22 మంది ప్రాణాలు తీసుకున్న కిరాతకుడే రాబర్ట్ కార్డ్(Robert Card). మైనే రాష్ట్రంలోని లివిస్టన్ పట్టణంలో అతను ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 40 ఏళ్ల కార్డ్ ఓ రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్. గతంలో అతన్ని గృహ హింస కేసులో అరెస్టు చేశారు. ఈ ఏడాది ఆరంభంలో అతను రెండు వారాల పాటు మానసిక చికిత్స తీసుకున్నాడు. మానసిక రోగి అయిన కార్డ్.. మైనే రాష్ట్రంలో ఉన్న సాకో మిలిటరీ శిక్షణ కేంద్రంపై అటాక్‌కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. మెంటల్ హెల్త్ ఫెసిలిటీలో అతన్ని అడ్మిట్ చేశారు.
లివిస్టన్ పట్టణంలో ఉన్న బౌలింగ్ అలేతో పాటు స్థానిక రెస్టారెంట్, బార్, మరో చోట కార్డ్ తన వద్ద ఉన్న ఆటోమెటిక్ గన్‌తో కాల్పులు జరిపాడు. స్థానిక పోలీసులు ఫేస్బుక్లో రాబర్ట్ ఫోటోను రిలీజ్ చేశారు. అత్యంత ప్రమాదకర వ్యక్తి అని పోలీసులు తమ పోస్టులో తెలిపారు. కాల్పులు జరిపిన తర్వాత ఆ షూటర్ తెల్ల సుబరు కారు డ్రైవ్ చేసుకుంటూ పరారీ అయ్యాడు. ఆ కారు ఫోటోలను కూడా పోలీసులు రిలీజ్ చేశారు.
స్కిమెంజిస్ బార్, గ్రిల్లే రెస్టారెంట్, స్పేర్టైం రిక్రియేషన్ ప్రాంతాల వద్ద కార్డ్ కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. లివిస్టన్ పట్టణంలో దాదాపు 38 వేల మంది నివాసం ఉంటున్నారు. బ్రౌన్ టీ షర్ట్ ధరించిన అతని చేతుల్లో రైఫిల్ ఉన్నట్లు పోలీసులు చెప్పారు. మిలిటరీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న రాబర్ట్ కార్డ్.. ఫైర్ఆర్మ్స్ ఇన్‌స్ట్రక్టర్‌గా చేశాడు. కాల్పుల ఘటన గురించి అధ్యక్షుడు బైడెన్‌కు కూడా వివరించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

