‘సరైన లోదుస్తులు ధరించండి’… క్యాబిన్ సిబ్బందికి పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ ఆదేశం
పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇటీవల అంతర్గతంగా జారీ చేసిన ఒక ఉత్తర్వుపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘సరైన లోదుస్తులపై’ సరైన ఫార్మల్ డ్రెస్ ధరించాలని అంతర్గత మెమోలో ఆ సంస్థ పేర్కొంది.
ఇస్లామాబాద్: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్ సంస్థ ఇటీవల అంతర్గతంగా జారీ చేసిన ఒక ఉత్తర్వుపై విమర్శలు వెల్లువెత్తాయి. ‘సరైన లోదుస్తులపై’ సరైన ఫార్మల్ డ్రెస్ ధరించాలని అంతర్గత మెమోలో ఆ సంస్థ పేర్కొంది. ఈ మేరకు జియో టీవీ వెల్లడిచింది. ఆ టీవీ కథనం ప్రకారం పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ) తన క్యాబిన్ సిబ్బందికి ఇటీవల అంతర్గత సూచనలు జారీ చేసింది. ‘కొంతమంది క్యాబిన్ సిబ్బంది ఇంటర్‌సిటీలో ప్రయాణిస్తున్నప్పుడు, హోటళ్లలో బస చేస్తున్నప్పుడు, సందర్శనకు వెళ్లినప్పుడు సాధారణ దుస్తులు ధరించడం చాలా ఆందోళన కలిగిస్తున్నది. అలాంటి డ్రెస్సింగ్ విధానం చూసేవారికి పేలవమైన అభిప్రాయాన్ని కలిగిస్తుంది. అలాగే వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా సంస్థపైనా నెగిటివ్ ఇమేజ్ కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో క్యాబిన్ సిబ్బంది ‘సరైన అండర్‌గార్మెంట్స్’పై సరైన ఫార్మల్ డ్రెస్ ధరించాలి. ఆ దుస్తులు కూడా పాకిస్థాన్ సంస్కృతి, జాతీయ నైతికతకు అనుగుణంగా ఉండాలి’ అని అంతర్గత మెమోలో పేర్కొంది. అయితే ఈ అంతర్గత ఉత్తర్వుపై విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (పీఐఏ)కు చెందిన క్యాబిన్ సిబ్బంది అదనపు డ్యూటీ సమయాలపై నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ కూడా ఇటీవల ఈ విషయంపై పీఐఏ సీఈవో అమీర్ హయత్‌కు లేఖ రాసింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పెట్టుబడిదారులకు రక్షణ కరువు.. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు అనువైన పరిస్థితులు లేవు
మోదీజీ.. ఎంతమంది పోలీసులనైనా తెచ్చుకోండి.. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ
ఇద్దరు పిల్లలతో తల్లి బలవన్మరణం
గిరిజన భూములు పరిరక్షించాలి.. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఏపీ, తెలంగాణకు వక్తల విజ్ఞప్తి
కాంగ్రెస్ కూటమికి పరాభవం!.. ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో ఈయూ కూటమి ప్రభంజనం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

