బీజింగ్, సెప్టెంబర్ 14: సౌరశక్తిని విద్యుత్తు శక్తిగా మార్చే ‘సోలార్ ప్యానెల్స్’ గురించి ఇప్పటివరకూ విన్నాం. ఎండలేని రోజు.. వర్షం పడుతుంటే.. అప్పుడు కూడా విద్యుత్తును ఉత్పత్తి చేసే ‘రెయిన్ ప్యానెల్స్‌ను’ చైనా పరిశోధకులు తాజాగా కనుగొన్నారు. సోలార్ ప్యానెల్స్‌లోని ‘ఫొటో వోల్టాయిక్ ప్యానెల్స్’ సౌర కాంతిని విద్యుత్తు శక్తిగా ఎలాగైతే మార్చాయే,
అదే పద్ధతిలో రెయిన్ ప్యానెల్స్ పనిచేస్తాయని సైంటిస్టులు తెలిపారు. ‘చినుకుల్లోనూ పుష్కలమైన పునరుత్పాదక శక్తి ఉంటుంది. చినుకులు గతిశక్తి(కైనటిక్), స్థిరవిద్యుత్తు శక్తిని కలిగివుంటాయి. దీనితో ప్యానెల్స్ విద్యుత్తును తయారుచేస్తాయి’ అని పరిశోధనా పత్రంలో సైంటిస్టులు పేర్కొన్నారు.