ఒకరికి తెలియకుండా మరొకరితో డేటింగ్.. చాలామంది యువతులకు వల.. చివరకు మనోడి గుట్టు ఎలా బయటపడిందంటే?

ఈరోజుల్లో డేటింగ్ అనేది కామన్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ డేటింగ్ కల్చర్ రోజురోజుకూ పెరిగిపోతోంది. చివరకు మన దేశంలో కూడా డేటింగ్ కల్చర్ నడుస్తోంది. అయితే.. ఒక వ్యక్తి ఒకేసారి పలువురు యువతులతో డేటింగ్ చేశాడు. ఒకరికి తెలియకుండా మరొకరితో డేటింగ్ చేస్తూ చివరకు అడ్డంగా బుక్కయిపోయాడు. మారుపేరుతో చాలామంది మహిళలతో అతడు ఆడుకుంటున్నాడని తెలుసుకొని ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఘటన న్యూయార్క్‌లో చోటు చేసుకుంది.
కలెబ్ అనే వ్యక్తి వెస్ట్ ఎల్మ్ కలెబ్ అనే మారుపేరుతో పలువురు యువతులను డేటింగ్ పేరుతో మోసం చేస్తున్నాడు. కొన్ని రోజులు సహజీవనం చేసి ఆ తర్వాత మొహం చాటేస్తాడు. కలెబ్ అలా ఓ యువతిని మోసం చేయడంతో ఆ యువతి టిక్‌టాక్‌లో వీడియో చేసి మరీ అతడి మోసం గురించి వెల్లడించింది. దీంతో ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
చివరకు ఆ వీడియోను చూసిన పలువురు యువతులు.. నువ్వు మాట్లాడేది వెస్ట్ ఎల్మ్ కలెబ్ గురించి కాదు కదా అంటూ తన వీడియోకు కామెంట్లు చేశారు. దీంతో కాదు.. నేను మాట్లాడేది కేవలం కలెబ్ అనే పేరు ఉన్న వ్యక్తి గురించి అని చెబుతుంది. కానీ.. ఈ వెస్ట్ ఎల్మ్ కలెబ్ ఎవరో తెలుసుకుందామని అనుకున్న ఆ యువతి.. అతడి గురించి సెర్చ్ చేస్తుంది. దీంతో డేటింగ్ యాప్‌లో కలెబ్ గురించి ఆరా తీయగా.. మారు పేరుతో చాలామంది యువతులను మోసం చేసింది తన మాజీ ప్రియుడు కలెబే అని తెలుసుకొని అవాక్కవుతుంది ఆ యువతి.
దీంతో వెంటనే మరో వీడియో చేసి.. కలెబ్కు అందరూ దూరంగా ఉండాలని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత అతడు సీరియల్ డేటర్ అని.. ఇలా చాలామందిని మోసం చేశాడని మరో యువతి కూడా వీడియో పోస్ట్ చేసింది. చాలామంది హింగే అనే డేటింగ్ యాప్ ద్వారా అతడికి పరిచయం అయ్యారని.. అతడితో చాలా జాగ్రత్తగా ఉండాలని చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో అతడి గురించే న్యూయార్క్ మొత్తం మాట్లాడుకుంది. అంతే కాదు.. #WestElmCaleb అనే హ్యాష్ టాగ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే.. ఇప్పటి వరకు వెస్ట్ ఎల్మ్ కలెబ్ పేరుతో ఉన్న వ్యక్తి మాత్రం స్పందించలేదు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Cyclone Arnab | అర్నాబ్ తుపాను ఎఫెక్ట్.. పాపికొండలు విహారయాత్రకు బ్రేక్..!
MLA Anirudh Reddy | నేను చచ్చిపోతా.. ఆ తర్వాత నిధులు ఇయ్యండి : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Modi Ka Baap Bhi Jayega: ఖర్గే క్షమాపణ చెప్పాల్సిందే.. దేశవ్యాప్తంగా దిష్టిబొమ్మలు దహనం
Invited for Bihu, then attacked | పూజా కార్యక్రమానికి ఆహ్వానించి.. బిహు కళాకారులపై దాడి
Womens Health | వయస్సు మళ్లుతున్న మహిళల్లో ఈ లక్షణాలు కనిపిస్తుంటే.. జాగ్రత్త పడాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య

