వాషింగ్టన్, మార్చి 23: విశ్వానికి సంబంధించి ఎప్పటికప్పుడు కొత్త విషయాలను బయటపెట్టే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మరో ఆసక్తికర విషయాన్ని గుర్తించింది. వీహెచ్ఎస్ 1256 బి అనే గ్రహం అత్యంత నిదానంగా కదులుతుందని, ఇది దాని సూర్యుడి చుట్టూ తిరగడానికి ఏకంగా పది వేల ఏండ్లు పడుతుందని వెల్లడించింది.
ఈ గ్రహం 22 గంటల్లో ఒక రోజును పూర్తి చేసుకుంటున్నదని గుర్తించింది. దీని వయసు దాదాపుగా 150 మిలియన్ సంవత్సరాలు ఉంటుందని పేర్కొంది. భూమికి ఈ గ్రహం 40 కాంతి సంవత్సరాల దూరంలో ఉందని అంచనా వేసింది.