US vs Iran | ఇరాన్తో ఉద్రిక్తతలు.. ఇజ్రాయెల్ సహా పశ్చిమాసియా దేశాలకు అమెరికా ఆయుధాల విక్రయం..!
US vs Iran | అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ (Iran) తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ (Israel) సహా పశ్చిమాసియా దేశాల (West Asian Countries) కు భారీగా ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా (USA) సిద్ధమైంది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుండగానే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
US vs Iran : అమెరికా, ఇజ్రాయెల్ దేశాలకు ఇరాన్ (Iran) తో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ (Israel) సహా పశ్చిమాసియా దేశాల (West Asian Countries) కు భారీగా ఆయుధాలను విక్రయించేందుకు అమెరికా (USA) సిద్ధమైంది. ఒకవైపు కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుండగానే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఇజ్రాయెల్, కువైట్ (Kuwait), ఖతార్ (Qatar), యూఏఈ (UAE) లాంటి మిత్ర దేశాలకు దాదాపు 8.6 బిలియన్ డాలర్లకుపైగా (భారత కరెన్సీలో రూ.81 వేల కోట్లకుపైగా) విలువైన ఆయుధాల విక్రయానికి యూఎస్ విదేశాంగశాఖ ఆమోదం తెలిపింది.
ఈ ప్యాకేజీలో అనేక అధునాతన సైనిక పరికరాలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ ప్యాకేజీ నుంచి ఖతార్ నాలుగు బిలియన్ డాలర్ల విలువైన పేట్రియాట్ వాయు, క్షిపణి రక్షణ వ్యవస్థలతోపాటు అత్యంత కచ్చితత్వంతో కూడిన లక్ష్యాలను ఛేదించగల ఆయుధ వ్యవస్థలను అందుకోనుంది. కువైట్కు సుమారు 2.5 బిలియన్ డాలర్ల ఆయుధాలు వెళ్లనున్నాయి. ఈ క్రమంలోనే ఇజ్రాయెల్, యూఏఈలకు గైడెడ్ రాకెట్ లాంఛర్లను యూఎస్ విక్రయించనుంది.
సాధారణంగా ఆయుధ విక్రయాలను అమెరికా కాంగ్రెస్ రివ్యూ చేస్తుంది. అయితే ట్రంప్ యంత్రాంగం అత్యవసర అధికారాలను ఉపయోగించి త్వరగా ఈ విక్రయాలు జరపాలని నిర్ణయించింది. ఈ చర్యను యూఎస్ విదేశాంగ మంత్రి మార్కో రూబియో సమర్థించుకున్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

